కాలువ పనులు పరిశీలించిన మంత్రి

నల్లగొండ జిల్లా:నిడమనూర్ మండలం వేంపాడు వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువ మరమ్మతు పనులను మంత్రి జగదీశ్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు.

మంత్రితో పాటు ఎమ్మెల్యేలు నోముల భగత్,శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు.

ఈ సందర్భంగా గండి పూడ్చివేత చేపట్టిన పద్ధతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎన్ఎస్పీ అధికారులకు సూచించారు.

గండి పడడంతో 14 రోజుల తర్వాత అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
Advertisement

Latest Nalgonda News