ఆరు విడతలుగా జగన్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఎఫెక్ట్ తో వైసీపీ( YCP )లో ఇంకా అలకులు, ఆగ్రహావేశాలు కనిపిస్తూనే ఉన్నాయి.చాలా నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల సమీకరణాలను లెక్కలు వేసుకుని జగన్( YS Jagan ) అభ్యర్థులను ప్రకటించారు.
సిట్టింగ్ లను మార్చి కొందరికి వేరే నియోజకవర్గాల్లో అవకాశం కల్పించారు.ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి ఎంపీలుగాను, ఎంపీలుగా ఉన్న వారికి ఎమ్మెల్యేలుగాను అవకాశం ఇచ్చారు అయితే ఈ మార్పు చేర్పు;లపై కొంతమంది బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది అలక చెంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇదిలా ఉంటే ఆలూరు నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడి నుంచి ప్రాతిపద్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరి జయరాం( Minister Gummanur Jayaram ) ను కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జి జగన్ నియమించారు.
ఆలూరు అసెంబ్లీ ఇన్చార్జిగా( Alur Assembly In charge ) విరూపాక్షిని నియమించారు.ఈ మార్పు చేర్పులపై మంత్రి జయరాం తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు.కొద్దిరోజులుగా ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదు.
ఆయన బళ్లారిలో ఉంటున్నట్లు సమాచారం.ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశానికి జయరాం హాజరు కాలేదు.
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు జయరాం ఆసక్తి చూపించడం లేదు.నిన్న జరిగిన ఆలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి జయరాం హాజరు కాకపోవడం పై వైసీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది .
పార్టీ సమావేశానికి హాజరైన రామసుబ్బారెడ్డి( Ramasubbareddy ) దీనిపై జయరాంను వివరణ కోరెందుకు ప్రయత్నించినా.ఆయన అందుబాటులోకి రాలేదు.దీంతో జయరాం ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరనే విషయాన్ని గుర్తించింది.ఒక వేళ ఈ విషయంలో జయరాం మనసు మార్చుకుంటే సరే లేదంటే అక్కడ జయరాం కు ప్రత్యామ్న్యాయంగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా రామయ్య అనే వ్యక్తిని ప్రకటించే ఆలోచనలో ఉందట.
జయరాం ఈ విషయంలో దీనిపై మంత్రి జయరాం రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.