బెండ సాగులో మచ్చల బోల్ వార్మ్ పురుగులను అరికట్టే పద్ధతులు..!

కూరగాయల పంటలలో బెండ కూడా ఒకటి.బెండ పంటకు ( Ladies finger cultivation )మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

 Methods To Prevent Spotted Bollworms In Okra Cultivation , Bendi Cultivation ,-TeluguStop.com

అయితే బెండను సాగు చేసే రైతులు( Farmers ) ఆ పంటను ఆశించే చీడపీడలు తెగుళ్లను సకాలంలో గుర్తించి, తొలి దశలోనే అరికట్టే ప్రయత్నం చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.బెండ పంటను సాగు చేసే రైతులు పంటను ఆశించే చీడపీడలు,( Pests ) తెగుళ్లపై ముందుగా అవగాహన కల్పించుకోవాలి.

అప్పుడే పంటను సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.బెండ పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో మచ్చల బోల్ వార్మ్ పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ పురుగులు రెండు సెంటీమీటర్ల పొడవు ఉండి పాలిపోయిన పచ్చని రంగులో ఉంటాయి.మొక్క లేత చిగుళ్లపై, పూమొగ్గలపై నీలిరంగు గుడ్లను పెడతాయి.

Telugu Agriculture, Farmers, Finger, Organic Method-Latest News - Telugu

ఈ పురుగుల లార్వా బెండకాయలపై దాడి చేస్తుంది.చిగుర్లు పువ్వులను కూడా ఆహారంగా తీసుకుంటుంది.ఈ పురుగులు పంటను ఆశిస్తే మొగ్గలు పుష్పించకుండానే రాలిపోతాయి.మొక్క ప్రధాన కాండం దెబ్బతిని మొక్క కుప్ప కూలిపోతుంది.ఈ పురుగులు పంటను ఆశిస్తే తొలి దశలో అరికట్టడం కాస్త ఆలస్యమైన కూడా సగానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది.ఈ పురుగులు పంటను ఆశించకుండా ఉండాలంటే.

.తెగులు నిరోధక మొక్కలను ఎంపిక చేసుకుని మొక్కల మధ్య సరిపడా దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఎరువులను సరైన మోతాదులో వేసుకోవాలి.చీడపీడలను ఆకర్షించే ఎరా పంటలను వేసుకోవాలి.పంట మార్పిడి కచ్చితంగా చేయాలి.

Telugu Agriculture, Farmers, Finger, Organic Method-Latest News - Telugu

ఈ పురుగుల గుడ్లు, చిన్న లార్వాలను సేంద్రీయ పద్ధతిలో( Organic method ) అరికట్టాలి.బ్రేకొనిడయి, స్కెలియనిడయి లాంటి పరానా జీవి కందిరీగల ద్వారా వీటిని నియంత్రించవచ్చు.హేమిప్తేరా, న్యూరోప్తేరా లాంటి కీటకాలను ఉపయోగించి ఈ పురుగులను పూర్తిగా అరికట్టవచ్చు.

రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే.గుడ్ల దశలో ఉన్నప్పుడే వీటిని అరికట్టే ప్రయత్నం చేయడం మంచిది.

ఏమామెక్టిన్ బెంజోయెట్, మేథోమేల్ లాంటి మందులు ఉపయోగించి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి ఈ పురుగులను అరికడితే మంచి దిగుబడులు సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube