భారత సంతతికి చెందిన యాపిల్ కంపెనీ( Apple Company ) ఎగ్జిక్యూటివ్, ఆ సంస్థ హెల్త్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న సుంబుల్ దేశాయ్( Sumbul Desai ) రాబోయే రోజుల్లో తమ లక్ష్యాలను వెల్లడించారు.వినియోగదారుల మానసిక, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తామని ఆమె చెప్పారు.
మనిషి జీవితంలో మానసిక, కళ్ల ఆరోగ్యం అత్యంత కీలకమైనవని.కానీ వాటిని ప్రజలు విస్మరిస్తారని వ్యాఖ్యానించారు.
వినియోగదారులకు వారి ఆరోగ్యంపై మరింత మెరుగైన అవగాహన కల్పించేందుకు మరిన్ని కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని సుంబుల్ దేశాయ్ తెలిపారు.కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్బ్యూడీసీ) సదస్సులో దేశాయ్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
iOS 17, iPadOS 17, watchOS 10లో అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త మెంటల్ హెల్త్ ఫీచర్లు వినియోగదారుల భావోద్వేగాలు, రోజువారీ మూడ్‌ను అంచనా వేస్తాయని దేశాయ్ తెలిపారు.iPhone, iPad, Apple Watchలు మయోపియా( Myopia ) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడేలా కొత్త విజన్ హెల్త్ ఫీచర్‌లను అందిస్తాయన్నారు.
త్వరలో iPadలో కొత్తగా హెల్త్ యాప్ రానుందని.ఇది వినియోగదారులకు వారి ఆరోగ్య వివరాలను తెలుసుకునేందుకు వీలు కలిగిస్తుందని దేశాయ్ చెప్పారు.
యాపిల్ కీనోట్‌లు, హెల్త్ యాప్, ఫీచర్ రిచ్ వాచ్‌ల అభివృద్ధి వెనుక డాక్టర్ దేశాయ్ కీలకపాత్ర పోషించారు.స్వీడన్‌లో జన్మించిన దేశాయ్.యాపిల్ క్లినికల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, మెడికల్ రీసెర్చ్, క్లినికల్ పార్ట్‌నర్‌షిప్‌ల వంటి పనులను పర్యవేక్షిస్తున్నారు.ఆమె కొద్దిరోజుల క్రితం స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్‌లో మెడిసిన్ విభాగంలో స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ వైస్ చైర్‌గా పనిచేశారు.
ఇకపోతే.మయోపియా లేదా నియర్‌సైటెడ్‌నెస్( Nearsightedness ) ప్రపంచవ్యాప్తంగా దృష్టి లోపానికి ప్రధాన కారణం.ఇది ప్రస్తుతం జనాభాలో 30 శాతానికి పైగా ప్రభావితం చేస్తుందని నిపుణుల అంచనా.2050 నాటికి 50 శాతం లేదా 5 బిలియన్ల మంది మయోపియా బారినపడతారని అంచనా.కాగా.ఆపిల్ హెల్త్ యాప్ ద్వారా యూజర్లు పగటిపూట గడిపిన సమయాన్ని వీక్షించవచ్చు.పగటిపూట గడిపిన సమయం పిల్లల్లో మయోపియా ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.watchOS 10తో యూజర్లు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
వీటితో పాటు వినియోగదారులు iOS 17, iPadOS 17, Health యాప్‌లలో వారి Apple Watch ద్వారా పగటిపూట గడిపిన సమయాన్ని వీక్షించవచ్చని యాపిల్ తెలిపింది.