మానసిక ఆరోగ్యం మెరుగు పడాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Mental Health Lemon Honey Health Tips

ఆరోగ్యం అంటే శారీరకంగా దృఢంగా ఉండడం అని అనుకుంటారు.నిజానికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఏ సమస్య లేకుంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క.

 Mental Health Lemon Honey Health Tips-TeluguStop.com

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవనం మనల్ని నిర్వీర్యం చేస్తుంది.వీటితో పాటు అనేక ఒత్తిడులు, ఒంటరితనం, డిప్రెషన్ లోకి వెళ్లడం వీటన్నింటి ద్వారా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మరి ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి? మానసిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి? ఇలాంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.మన మానసిక ఆరోగ్యం కోసం కేవలం మనశ్శాంతితో మాత్రమే కాకుండా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు.

 Mental Health Lemon Honey Health Tips-మానసిక ఆరోగ్యం మెరుగు పడాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు.మానసిక ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు ఇక్కడ చూసి తెలుసుకుందాం.

బాగా మరుగుతున్న నీటిలో పది తులసి ఆకులు, కొంచెం యాలకుల పొడి ఈ రెండు మిశ్రమాలను మరుగుతున్న నీటిలో వేసి ఆ కషాయాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.ఆ కషాయాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం ద్వారా అనేక మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి.

రోజూ ఉదయమే గోరువెచ్చని నీటిలోకి కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం ద్వారా మన మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, రోజంతా చాలా చురుకుగా ఉంటారు.ఆహార విషయానికొస్తే మాంసం, పాలు, చేపలు, గుడ్లు మొదలైన వాటిలో విటమిన్ బి 12 అధికంగా ఉంటుంది.

ఇది మెదడు పనితీరును మెరుగు పరచడంతో పాటు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంపొందిస్తుంది.

శరీరానికి మెగ్నీషియం ఎంతో అవసరం.

ఇది తక్కువ స్థాయిలో ఉండడం వల్ల భయాందోళనలు, నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలు అధికమవుతాయి.చిక్కుడు కాయ విత్తనాలు.

చేపలు, ఆకుకూరలు, తృణధాన్యాలు వంటి వాటిలో మెగ్నీషియం మెండుగా లభిస్తుంది.వీటిని తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిళ్లు దూరం అవుతాయి.

సెలీనియం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.ఇది మానసిక స్థితిని మెరుగు పరచడంలో సహాయపడుతుంది.

పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు, సరైన సమయంలో నిద్రపోవడం, శారీరక వ్యాయామాలు చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చు.

#Milk #Honey #Loneley Ness #Eggs #Meat

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube