మెగా డాటర్ పై మండిపడుతున్న అభిమానులు...

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించినటువంటి ఒక మనసు చిత్రంతో టాలీవుడ్లోకి తెరంగేట్రం చేసిన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు టవర్ స్టార్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి తెలియని వారుండరు.అయితే గతకొద్దికాలంగా ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండటంతో కొంతమేర నిహారిక సినీ కెరీర్ ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.

 Mega Daughter Niharika Photos-TeluguStop.com

అయితే తాజాగా నిహారిక పలు సంస్థలు నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొని కొంతమేర హాట్ గా ఫోటో లకి ఫోజ్ ఇచ్చింది.దీంతో మెగా అభిమానులు నిహారిక ఫోటోలను ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేగాక పలువురు దయచేసి ఇలాంటి ఫోటోలకు ఫోజులిచ్చి మెగాస్టార్ కుటుంబానికి ఉన్నటువంటి పరువుని దిగజార్చద్దని నిహారికని వేడుకుంటున్నారు.మరికొందరైతే అయినా సినిమాల్లో అవకాశాల కోసం ఇలా చేయడం సరికాదని అంటున్నారు.

అయితే మరికొందరు మాత్రం నిహారిక ని సపోర్ట్ చేస్తున్నారు.ఎందుకంటే సినీ పరిశ్రమలో ఇలాంటివి కామన్ అని ఒక్క అవకాశాల పరంగా కాకుండా తమలోని టాలెంట్ ని  గుర్తించాలని  అభిప్రాయపడుతున్నారు.

Telugu Niharika, Tollywood-Movie

అయితే గతంలో నిహారిక మెగాస్టార్ చిరంజీవి నటించిన టువంటి సైరా చిత్రంలో నటించింది.కానీ ఈ చిత్రంలో నిహారిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఎవరూ గుర్తించలేదు.దీంతో నిహారికకు పెద్దగా అవకాశాలు రాలేదు.అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో నిహారిక ఓ బాలీవుడ్ వెబ్ సీరిస్ లో నటిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube