Tobacco Crop : పొగాకు పంటను గోధుమ మచ్చ తెగుళ్ల వ్యాప్తి నుంచి సంరక్షించే చర్యలు..!

పొగాకు పంట( Tobacco crop ) వర్షాధార పంటగా నల్లరేగడి భూములలో అధిక విస్తీర్ణంలో సాగు అయ్యే పంట.భూమిలో ఉండే తేమను ఆధారంగా చేసుకుని రబీ పంటగా పొగాకు అధిక విస్తీర్ణంలో సాగు అవుతుంది.

 Measures To Protect The Tobacco Crop From The Spread Of Brown Spot Pests-TeluguStop.com

పొగాకు పంటకు వివిధ రకాల చీడపీడల, తెగుళ్ల బెడద( Pests ) తక్కువగా ఉండాలంటే వేసవిలో ట్రాక్టర్ తో లోతు దుక్కులు దున్నుకోవాలి.ఆ తర్వాత గొర్రుతో రెండు లేదా మూడు సార్లు దుండిన తర్వాత గుంటకతో పోలాన్ని చదును చేయాలి.

ప్రధాన పొలంలో నాటుకునే పొగాకునారు తెగులు నిరోధక, ఆరోగ్యకరమైన నారు అయి ఉండాలి.అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు నాటుకునేందుకు అనుకూల సమయం.పొగాకు నారును 70*50 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి.నారు నాటిన 20 రోజుల నుండి 50 రోజుల మధ్యలో కనీసం మూడు లేదా నాలుగు సార్లు అంతర కృషి చేస్తే పొలంలో ఉండే పగుళ్లు కప్పడంతో పాటు తేమ నిల్వ ఉండేందుకు అవకాశం ఉంటుంది.

పొగాకు పంటకు అందించాల్సిన పోషక ఎరువుల విషయానికి వస్తే.ఒక హెక్టార్ కు 2.5 పశువుల ఎరువుతో( cattle manure ) పాటు 20-20-0 125 కిలోలు, అమోనియం సల్ఫేట్ ( Ammonium sulfate )100 కిలోలు, సల్ఫేట్ ఆఫ్ పొటాష్( Sulphate of potash ) 50 కిలోలు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.పొగాకు పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే గోధుమ మచ్చ తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

సిఫారసు చేసిన మోతాదులో పొటాష్ ఎరువులు మొక్కలకు అందించాలి.ఈ తెగుళ్లను పొలంలో గుర్తించిన తర్వాత 10 లీటర్ల నీటిలో ప్రోపికొనజోల్ 10మి.లీ ను కలిపి పిచికారి చేయాలి.పొగాకు పండించే పొలంలో పంట మార్పిడి అనేది తప్పనిసరి.

నేలలో సారం అధికంగా ఉంటే జొన్న, మెట్టవరి, సజ్జ లాంటి పంటలు వేయాలి.నేలలో సారం తక్కువగా ఉంటే పెసర మినుము పిల్ల పెసర లాంటి పంటలు వేసి పచ్చిరొట్ట ఎరువుగా భూమిలో కలియదున్నాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube