Bitter Guard : కాకర పంటను మచ్చ తెగుళ్ల వ్యాప్తి నుంచి సంరక్షించే చర్యలు..!

తీగజాతి కూరగాయలలో ఒకటైన కాకరకు చీడపీడల, తెగుళ్ల బెడద( Pests ) కాస్త తక్కువే.కాకర పంట సాగు విధానంపై అవగాహన ఉంటే తక్కువ పెట్టుబడి పెట్టి మంచి అధిక దిగుబడులు సాధించవచ్చు.ఇక కాకరకాయ పంటకు( bitter guard ) నేల యొక్క పిహెచ్ విలువ 5.5 నుంచి 6.4 వరకు ఉండే అని రకాల నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.ఒక ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు( Cattle manure ) , 25 కిలోల యూరియా, 50 కిలోల డి.ఏ.పి, 25 కిలోల పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి పొలాన్ని కలియ దున్నుకోవాలి.

 Measures To Protect Kakar Crop From The Spread Of Spotted Pests-TeluguStop.com

ఇక విత్తనాల విషయానికి వస్తే హైబ్రిడ్ విత్తనాలు( Hybrid seeds ) అయితే ఒక ఎకరాకు 500 గ్రాములు, దేశవాళీ రకం అయితే ఒక ఎకరాకు 800 గ్రాముల విత్తనాలు అవసరం.కాకర పంటను అడ్డ పందిరి లేదంటే పైపందిరి విధానంలో సాగు చేయాలి.

మొక్కల మధ్య 50 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య రెండు మీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

కాకర పంట వేసిన 25 రోజులలోపు రెండు గ్రాముల బోరాన్ ( Boron )ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.పంట 45 రోజులకు పూతకు రావడం మొదలవుతుంది.పంట పూత దశకు వచ్చాక రెండు గ్రాముల బోరాన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పంట వేసిన 60 రోజులకు మొదటి కోత చేతికి వస్తుంది.నీటిని డ్రిప్ విధానం ద్వారా అందించి, మల్చింగ్ కవర్ సాగు పద్ధతి ఉపయోగిస్తే, కలుపు సమస్య తక్కువగా ఉండడంతో పాటు చీడపీడల తెగుళ్ల సమస్య కూడా తక్కువగానే ఉంటుంది.

కాకర పంటకు మచ్చ తెగుళ్లు సోకితే ఊహించని పంట నష్టం ఎదుర్కోవాల్సిందే.కాకర మొక్క ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి క్రమంగా పెరిగి ఆకు మొత్తం విస్తరిస్తాయి.ఆ తర్వాత ఆకులు ఎండిపోతాయి.రెండు గ్రాముల కార్బండిజమ్ లేదా 2గ్రాముల సాఫ్ ను ఒక లీటరు నీటిలో కలిపి ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube