వైరల్: రీల్స్ కోసం రిస్క్ చేసిన యువకుడు.. అవసరమా అంటున్న నెటిజన్లు!

సోషల్ మీడియా( Social Media ) బాగా ప్రబలిన తరువాత స్టంట్ చేసే హీరోలు మన దగ్గర ఎక్కువైపోయారు.దాంతో ఈ కేటగిరికి చెందిన వీడియోలు ప్రతిరోజూ ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తూనే వుంటాయి.

 Man Perform Shocking Stunt On Car Video Viral Details, Viral Video, Risk For Ree-TeluguStop.com

చాలామంది సినిమాల నుండి ప్రేరణ పొంది ఇలాంటి రకరకాల విన్యాసాలు( Stunts ) చేయడానికి వుత్సుకత చూపుతారు.కానీ వీరికి తెలియని నిజం ఏమంటే, సినిమాలలో చేసేదంతా డూప్ అని.కానీ ఆ విషయం తెలియని మన కుర్రాళ్ళు మాత్రం కాస్త రిస్క్ ఎక్కువగానే తీసుకుంటారు.కానీ మంచి స్టంట్‌ని బాగా ప్రాక్టీస్ చేసి.

నైపుణ్యం కలిగిన వ్యక్తి మాత్రమే చేయగలడు.అయితే ప్రస్తుతం నెట్టింట్లో స్టంట్ కి సంబంధించిన వీడియో ఎవరు చేశారా అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము.

కానీ అది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్న పరిస్థితి.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎత్తుపల్లాలున్న మట్టి రోడ్డు పైనుండి ఒక కారు( Car ) వస్తోంది.కారు పైన ఒక కార్డ్ బోర్డు దానిమీద ఒక యువకుడు కూడా నిలబడి ఉన్న విషయం మనకు అర్ధం అవుతోంది.ఇంతలో కుడి వైపు నుండి ఒక కారు అతి వేగంతో వచ్చి ఆ యువకుడు నిల్చున్న కార్డు బోర్డు ని ఢీకొట్టుకుంటూ దూసుకుపోతుంది.

ఇలా కారు తాను నిల్చున్న కార్డు బోర్డు ని( Cardboard ) ఢీకొనడంతో దానిపై నిల్చున్న యువకుడు ఎగిరి దుమికి నేలపై పడిపోతాడు.

అదే ఆ స్టంట్ స్క్రీన్ప్లే.అయితే ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసేవే.కాగా ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ కాగానే జోరుగా వైరల్ అయింది.

ఇప్పటికే ఈ వీడియోను మూడు లక్షల మందికి పైగా లైక్ చేయడం కొసమెరుపు.ఇక ఈ వీడియోని చూసిన జనాలు విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.కొంతమంది ‘ఈ స్టంట్ వీడియో నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని కామెంట్ చేస్తే మరికొంతమంది ఇలాంటివి చేయడం డేంజర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube