మ‌మ‌త‌ ఘ‌న‌త‌: 34 ఏళ్ల వామ‌ప‌క్ష ప్ర‌భుత్వాల‌ను కూల‌దోసి... మోదీ హ‌వాకు చెక్ పెట్టి...

మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు… ఆమె వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయిన ఘ‌త‌న సాధించారు.దీదీగా పేరొందిన మమతా బెనర్జీకి ఎన్నో విజయాలు సాధించారు.

 Mamata Banerjee Glory Toppled 34-year-old Leftist Governments Details, Mamata Ba-TeluguStop.com

మమతా బెనర్జీ దేశంలోనే తొలి మహిళా రైల్వే మంత్రిగా కూడా ఖ్యాతి గ‌డించారు.దీనితో పాటు ఆమె పశ్చిమ బెంగాల్‌కు మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా ఎన్నిక‌య్యారు.

జీవన పోరాటంతోనే దీదీ ఈ స్థానాన్ని సాధించారు.మమతా బెన‌ర్జీ బాల్యం అంతా పేదరికంలోనే గడిచింది.

ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు.ఆ తర్వాత మొద‌లైన ఆమె జీవ‌న‌పోరాటం అప్ర‌తిహ‌తంగానే కొన‌సాగుతూ వ‌స్తోంది.బెంగాల్‌లో 34 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వామపక్షాల ప్రభుత్వాన్ని కూలదోసిన ఘ‌న‌త మ‌మ‌త సొంతం.

మమతా బెనర్జీ బాల్యం

మమతా బెన‌ర్జీ 1955 జనవరి 5న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు.మమతా బెనర్జీకి 9 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి ప్రమీలేశ్వర్ బెనర్జీ క‌న్నుమూశారు.తన తోబుట్టువులను చూసుకునే బాధ్యత ఆమెపై ప‌డింది.మమత కోల్‌కతాలోని జోగోమయా దేవి కళాశాల నుండి పట్టభద్రుల‌య్యారు.తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఇస్లామిక్ చరిత్రలో పీజి చేశారు.

మమతా బెనర్జీ జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజీ నుండి న్యాయ పట్టా పొందారు.

Telugu Bengalcm, Kolkata, Mamata Banerjee, Mamatabanerjee, Mamta Banerjee, Naren

15 ఏళ్లకే కాంగ్రెస్‌లో చేరిన మమత

మమతా బెనర్జీ చిన్నతనంలో కాంగ్రెస్ వైపు పూర్తిగా మొగ్గు చూపారు.దీదీ కేవలం త‌న‌15 ఏళ్ల వ‌య‌సులోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.1975లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ (ఐ) ప్రధాన కార్యదర్శిని నియమించారు.1978లో ఆ పార్టీ మమతా బెనర్జీని కలకత్తా సౌత్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా నియ‌మించింది.

Telugu Bengalcm, Kolkata, Mamata Banerjee, Mamatabanerjee, Mamta Banerjee, Naren

తొలిసారి ఎంపీగా

1984లో తొలిసారిగా మమతా బెన‌ర్జీ లోక్‌సభ ఎన్నికల టిక్కెట్‌ దక్కించుకున్నారు.మ‌మ‌త‌ దక్షిణ కోల్‌కతా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.1991లో మమతా బెనర్జీ మరోమారు లోక్‌సభ ఎంపీ అయ్యారు.ఈసారి కేంద్ర ప్రభుత్వంలో హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ప‌ద‌వి ద‌క్కించుకున్నారు.

1997లో టీఎంసీ ఏర్పాటు

1996లో మమతా బెనర్జీ మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నిక‌ అయ్యారు.అయితే కొద్ది కాలానికే ఆమె పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.మమతా బెనర్జీ జనవరి 1998లో తృణమూల్ కాంగ్రెస్ పేరుతో నూత‌న పార్టీని స్థాపించారు.ఆ తర్వాత బీజేపీతో టీఎంసీ కూటమి ఏర్పాట‌య్యింది.అటల్ ప్రభుత్వం హ‌యాంలో ఆమెకు మంత్రి పదవి లభించింది.

రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో మమతా బెనర్జీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని శ‌భాష్ అనిపించుకున్నారు.

Telugu Bengalcm, Kolkata, Mamata Banerjee, Mamatabanerjee, Mamta Banerjee, Naren

పశ్చిమ బెంగాల్‌లో మోదీ హవాకు గండి…

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభావం అంత‌కంత‌కూ పెరిగింది.ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా టీఎంసీ పోటీ చేసింది.ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజ‌య భేరి మోగించారు.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ హ‌వా ముందు మోదీ వేవ్ కూడా పనిచేయలేదని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube