కుందూర్ రఘువీర్ రెడ్డికే మాలల మద్దతు

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీ,బీసీల రిజర్వేషన్లను తొలగిస్తారని, రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారని రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవాలంటే కేంద్రంలో బీజేపీని గద్దేదించి కాంగ్రెస్ పార్టీ( Congress Party )ని గెలిపించాలని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.

చెన్నయ్య పిలుపునిచ్చారు.

సోమవారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో సవేరా హోటల్లో జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు అధ్యక్షతన మాల మహానాడు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య మాట్లాడుతూ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి( Kunduru Raghuveer Reddy )ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని దళిత, బహుజనులకు విజ్ఞప్తి చేశారు.బీజేపీ( BJP ) పాలనలో దళిత,గిరిజన మైనార్టీలతో పాటు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వారిపై దాడులు నిత్యం జరుగుతున్నాయని ఈ దేశ మెజారిటీ ప్రజలకు రక్షణతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

Malas Supports Kunduru Raghuveer Reddy,Kunduru Raghuveer Reddy,Mala,Nalgonda-క

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దళితులకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లతో పాటు అన్ని కులాల అభివృద్ధికి కార్పొరేషన్ లను ఏర్పాటు చేశారని దళిత, బహుజనులు మరింత అభివృద్ధిలోకి రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెన్నయ్య పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజి రమేష్,మన్నె శ్రీదర్ రావు,జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు, మళ్ళికంటి శ్రీనివాస్, వినయ్ కుమార్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

Latest Nalgonda News