సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలి

నల్లగొండ జిల్లా:తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దూమ్ భవనంలో బుధవారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నిజాం సర్కార్ రాక్షస పాలన నుండి ప్రజలను విముక్తి చేయడం కోసం నాడు కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని పేర్కొన్నారు.

దొరలు,భూస్వాములు,జమీందారులు, జాగీర్ దారులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో పల్లె పల్లెల ఎర్రజెండాలు పట్టి సాయుధ పోరాటంలో పాల్గొన్నారని,ఈ పోరాటంలో 4000 మంది ప్రాణాలను అర్పించి అమరులయ్యారని గుర్తు చేశారు.సాయుధ పోరాటానికి సంబంధంలేని బిజెపి నేడు పోరాట చరిత్రను వక్రీకరిస్తూ వారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు.

Make The Armed Struggle Week A Success-సాయుధ పోరాట వార

అదేవిధంగా 16 వ తేదీన నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ముగింపు సభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు.ఈ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసిం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు.

ముగింపు సభకు సాయుధ పోరాట అమరవీరుల కుటుబసభ్యులు,ప్రజలు,పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ సాయుధ పోరాట 74 వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం 15 వ తేదీన దేవరకొండ నియోజకవర్గంలోని డిండి నుండి రామంతపూర్,కందుకూర్,పడమటిపల్లి,తూర్పుపల్లి మీదుగా దేవరకొండ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని, ఈ బైక్ ర్యాలీ తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ప్రతి ఒక్క సిపిఐ కార్యకర్తలు కంకణబద్ధులై క్రమశిక్షణతో ఈ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఐ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Advertisement

ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉజ్జని యాదగిరిరావు,పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్,పబ్బు వీరస్వామి,బోల్డురి నర్సింహ,గురిజ రామచంద్రం,టి.వెంకటేశ్వర్లు,బంటు వెంకటేశ్వర్లు చారి,గిరి,రామ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News