నవంబర్ 3న బీసీ గర్జన ను విజయవంతం చేయాలి:బీసీ జేఏసీ

నల్లగొండ జిల్లా:ఈ నెల 3 న మిర్యాలగూడలో జరుగనున్న బీసీ గర్జనను విజయవంతం చేయాలని మిర్యాలగూడ బీసీ జెఏసి నేతలు కోరారు.

శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మిర్యాలగూడ జ్యోతిబా పూలే బీసీ భవన్ లో జెఏసి నాయకులు తమ్మడ బోయిన అర్జున్ అధ్యక్షతన వివిధ బీసీ కుల సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశానికి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న,బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య,నేతి విద్యాసాగర్,రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు,మేకపోతుల నరేందర్ గౌడ్ తదితరులు ముఖ్య నాయకులు హాజరై బీసీలు అందరూ వెనకకు నెట్టబడడం ఎలా జరిగింది? నెట్టిన వాళ్ళని వెనకకు తోసేయడానికి రంగం సిద్ధం అవుతుందని చెప్పడానికి విచ్చేయుచున్నారని, బీసీల బతుకులు మార్చడానికి జరిగే ఈ మహాసభకు తప్పనిసరిగా హాజరు కావలసిందిగా బీసీ బంధువులందరిని కోరారు.ఈ కార్యక్రమంలో అన్న భీమోజు నాగార్జున చారి,కోల సైదులు ముదిరాజ్,దాసరాజు జయరాజు,తిరుమలగిరి అశోక్,మారం శ్రీనివాస్,బంటు సైదులు,జంగిరాల నాగరాజు, నల్లగంతుల నాగభూషణం, గాదుగోని మహేష్ గౌడ్,పున్న రాములు,క్రాంతి శ్రీనివాస్ యాదవ్ చేగొండి మురళి యాదవ్,ఈశ్వర చారి, ఆధారపు మురళి నక్క శేఖర్ కొంకా రేవంత్ కుమార్ బంటు దుర్గయ్య ముదిరాజు సంఘ సభ్యులు వడ్డెర కుల సంఘ, సాతాని కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide

Latest Nalgonda News