రైలు కంటే వేగంగా ధోని పరుగులు..‘అన్ అకాడమీ’యాడ్ మామూలుగా లేదు..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.

 Mahendra Singh Dhoni Unacademy Ad Going Viral On Social Media Details, , Dhoni, Viral News, Mahendra Singh Dhoni ,unacademy Ad ,going Viral ,social Media, Ceo Gourav Munjal, International Education Day, Dhoni Un Academy Ad-TeluguStop.com

ధోని ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.క్రికెట్ నుంచి రిటైర్ అయిన స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఉన్నారు.తాజాగా ధోని చేసిన యాడ్‌కు సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట ట్రెండవుతోంది.

 Mahendra Singh Dhoni Unacademy Ad Going Viral On Social Media Details, , Dhoni, Viral News, Mahendra Singh Dhoni ,unacademy Ad ,going Viral ,social Media, Ceo Gourav Munjal, International Education Day, Dhoni Un Academy Ad-రైలు కంటే వేగంగా ధోని పరుగులు..‘అన్ అకాడమీ’యాడ్ మామూలుగా లేదు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే, ఈ యాడ్ చూసి కొందరు నెటిజన్లు వావ్ అని అంటుండగా, మరి కొందరు నెటిజన్లు ఇదేం యాడ్ అని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఇంతకీ ఆ యాడ్ .దేని గురించి అంటే.

‘అన్ అకాడమీ’ అనే ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్‌కు సంబంధించిన యాడ్ లో ఎం.

ఎస్.ధోని నటించారు.‘అన్ అకాడమీ’ సంస్థ.‘లెస్సన్ 7’ పేరిట రూపొందించిన ఈ యాడ్ తాజాగా విడుదల కాగా, అది నెట్టింట సందడి చేస్తోంది.సదరు యాడ్ లో ఎం.ఎస్.ధోని చాలా యాక్టివ్ గా కనిపించాడు.యాడ్‌లో ట్రైన్‌ వేగంగా వస్తుండగా, దాని ముందరే ధోని పరిగెడుతున్నాడు.

రైలు కంటే వేగంగా ధోని పరిగెడుతూ ముందుండే గోడలను చీల్చుకుంటూ వెళ్తున్నాడు.అలా మనం ఎన్ని అడ్డంకులు ఎదురైనా చీల్చుకుంటూ, వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలని సందేశం దృశ్య రూపకంలో చెప్పే విధంగా యాడ్ డిజైన్ చేశారు.

అలా అడ్డంకులను దాటుకుని ముందుకు వెళ్తేనే మన గమ్యాన్ని చేరుకోగలమనే సందేశాన్ని యాడ్‌లో ధోని చెప్పారు.గమ్యం వైపు చూపు.ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను దాటాలనే సంకల్పం.విజేతగా చేస్తుందని.ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ డే సందర్భంగా.విపత్కర సమయాల్లో ‘లెస్సన్‌ 7’ను గుర్తుంచుకోండి.

అనే క్యాప్షన్‌తో ఈ యాడ్‌ రిలీజ్ చేశారు.ఇదో ఐకానిక్ యాడ్‌ అని అన్‌ అకాడమీ సంస్థ సీఈవో గౌరవ్‌ ముంజల్‌ తెలిపారు.

ఇక ఈ యాడ్ చూసి నెటిజన్లు కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే, కొంత మంది మాత్రం నెటిజన్లు యాడ్ బాగా లేదని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ధోని ఎడ్యుకేషన్ ఎలా రిలేటెడ్ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube