శంషాబాద్ మండలం ముచింతల గ్రామం శ్రీరామ నగరం లోని చినజీయర్ స్వామి ఆశ్రమం ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు సందర్శించి చినజీయర్ స్వామి వద్ద మంగళా శాసనాలు తీసుకున్నారు.ఫిబ్రవరి మాసంలో జరగనున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఫిబ్రవరి 4న జరగనున్న సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమాల వివరాలను శివరాజ్ సింగ్ చౌహాన్ చిన్నజీయర్ స్వామి ని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంట ఆయన సతీమణి సాధన సింగ్ వున్నారు.