టీడీపీ నేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ముగింపు సభకు రంగం సిద్ధమైంది.ఈ మేరకు యువగళం నవశకం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలపల్లిలో ఏర్పాటు చేసిన యువగళం -నవశకం భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన శ్రేణులు తరలిరానున్నారు.సుమారు 110 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ సభకు ఆరు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత బాలకృష్ణ మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.అలాగే సభా వేదికపై నుంచి టీడీపీ -జనసేన ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉందని తెలుస్తోంది.