టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ పాదయాత్ర వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాయి.100 రోజుల పైలాన్ ను ఆవిష్కరించిన లోకేష్ తన సంతోషాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు. లోకేష్( Nara Lokesh ) తల్లి నారా భువనేశ్వరి పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కొడుకుని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు .
తెలుగుదేశం శ్రేణులు సంబరాలపై సెటైర్స్ వేశారు పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ( Rachamallu Siva Prasad )….వంద రోజులు కాదు వెయ్యి రోజుల పాదయాత్ర చేసినా లోకేష్ పాదయాత్ర వల్ల ఆ పార్టీ కి వచ్చే ప్రయోజనం గాని మా పార్టీ కి వచ్చే నష్టం గాని ఏమీ ఉండదు అని తేల్చేశారు రాచమల్లు శివప్రసాద్ .లోకేష్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు కాబట్టే పాదయాత్ర విజయవంతమైనదని చూపించుకోవడానికి రోజుకొకరిని తీసుకొచ్చి పాదయాత్ర లో కల్పిస్తున్నారని, ఆయన పాదయాత్రలో ఇంతవరకు పార్టీలో చేరిన నేతలు ఎంతమందో తెలుగుదేశం పార్టీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఆయన పాదయాత్రని అడ్డుకొని ఆయనకు మైలేజ్ ఇచ్చే ఉద్దేశం తమకు లేదని, కనీస ప్రాధాన్యత కూడా లేని అంశముగా లోకేష్ పాదయాత్ర మారిందని ఆయన ఎద్దేవా చేశారు.
తెలుగు దేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్( YS Jagan Mohan Reddy ) విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని , తమ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే.పొద్దుటూరులో ఆయన పాదయాత్రను అడ్డుకుంటారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు అల్లుడు లా వచ్చి వెళ్లిపోయే ఆయనను అడ్డుకొని ఆయన కు ఇమేజ్ పెంచే ఉద్దేశం మాకు లేదని ఆయనను అలా వదిలేస్తే సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
వాతావరణ పరిస్థితులను తట్టుకొని పట్టుదలగా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయి ప్రయోజనం కలగటం లేదని తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతుందని సమాచారం.
ప్రత్యర్థ పార్టీలకు దీటైన సమాధానం చెప్పగలుగుతున్నప్పటికీ ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడడంలో లోకేష్ ఇంకా పరిణిత చెందాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇంకా 400 రోజులు పాదయాత్ర చేయాల్సి ఉన్నందున ఆ దిశగా లోకేష్ కు మరింత ట్రైనింగ్ ఇవ్వాలని తెలుగుదేశం వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారట.