Nalgonda : నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి ఖరారు…!

నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు,పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి( Kunduru Raghuveer Reddy ) పేరును అధిష్టానం ఖరారు చేసింది.

నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం 9 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు.

అందులో జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి,పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.కానీ,టికెట్ కోసం ప్రధానంగా పోటీ జానారెడ్డితో పాటు తనయుడు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య నెలకొంది.

Kunduru Raghuveer Reddy Elected As The Nalgonda Congress Mp Candidate-Nalgonda

ఇదిలా ఉంటే పటేల్,రఘువీర్ ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు.దీంతో పటేల్ రమేష్ రెడ్డికి( Patel Ramesh Reddy ) కార్పొరేషన్ లేదా ఎమ్మెల్సీగా అవకాశం తప్పకుండా కల్పిస్తానని సిఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ), జానారెడ్డి హామీ ఇచ్చి నచ్చచెప్పినట్లు,హామీ పట్ల సంతృప్తి చెందిన రమేష్ రెడ్డి రఘువీర్ రెడ్డికే టికెట్ కేటాయించాలని పార్టీకి ప్రతిపాదన చేసినట్లు, అంతేకాకుండా పార్లమెంటు పరిధిలో ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా రఘువీర్ పేరును ప్రతిపాదన చేసినట్లు సమాచారం.

నాగార్జునసాగర్ మిర్యాలగూడ దేవరకొండ నియోజకవర్గాలలో కుందూరు కుటుంబానికి బలమైన క్యాడర్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.పార్లమెంటు పరిధిలో రఘువీర్ రెడ్డికి యూత్ ఫాలోయింగ్ కూడా ఉంది.

Advertisement

ఆయన 2014 నుంచి మిర్యాలగూడ శాసనసభ టికెట్ ఆశిస్తూ వస్తున్నారు.కానీ,కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు 2014లో నల్లమోతు భాస్కరరావు కు,2018 లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ( R krishnaiah )కు టికెట్ కేటాయించడంతో అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేశారు.గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీ బిఎల్ఆర్ కు టికెట్ కేటాయించడంతో అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉండి ఆయన గెలుపుకు పనిచేయడంతో పాటు ఆర్థికంగా కూడా జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేశారని పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Latest Nalgonda News