టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉప్పెన ( Uppena ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా వచ్చారు నటి కృతి శెట్టి( Kriti Shetty ) నటిగా ఈమె మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అనంతరం ఈమెకు వరుసగా తెలుగులో సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇక కృతి శెట్టి నటించిన తర్వాత రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి.ఇకపోతే ఇటీవల కాలంలో కృతి శెట్టి నటించిన ఏ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇలా వరుస సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కథల ఎంపిక విషయంలో కృతి శెట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈమె తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం మలయాళం భాషా చిత్రాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా కృతి శెట్టి చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈమె వెకేషన్ వెళ్లినటువంటి విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా కృతి శెట్టి బెల్లీ డాన్స్( Belly Dance ) కి సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు తన డాన్స్ మాస్టర్ సంజనతో కలిసి ఈమె బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతూ సాంగ్ కి బెల్లీ డాన్స్ చేశారు ఇక ఈ పాటకు ఈమె డాన్స్ కంపోజ్ చేయడం గమనార్హం.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కృతి శెట్టి బొంగరంలా తన నడుము ఊపుతుంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.