మళ్ళీ పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ

నల్లగొండ జిల్లా:మళ్ళీ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

ఎగువన శ్రీశైలం నుండి 1,43,132 క్యూసెక్కుల వరద పోటెత్తి నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరడడంతో బుధవారం అధికారులు ప్రాజెక్ట్ 12 క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

నాగార్జునసాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులు వద్ద నీరు నిలువ ఉంది.డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 312.0450 టీఎంసీల నిల్వ ఉంది.జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29394 క్యూసెక్కులను,కుడి కాలువ ద్వారా 9160 క్యూసెక్కులను,ఎడమ కాలువ ద్వారా 8280 క్యూసెక్కులను,ఎస్ఎల్బీసి ద్వారా 1800 క్యూసెక్కులనులో లెవెల్ కెనాల్ ద్వారా 600 క్యూసెక్కులను,మొత్తంగా 1,43,132 క్యూసెక్కులను వచ్చిన నీటిని వచ్చినట్టు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Krishnamma Is Treading On Paravals Again , Krishnamma, Paravals Again, Nagarjuna

Latest Nalgonda News