ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన కృష్ణ..అందుకే ఈ సినిమాలు తీసారా?

సీనియర్ ఎన్టిఆర్( SR ntr ) కృష్ణ గురించి కొత్తగా పరిచేయం చేయాల్సిన అవసరం లేదు.బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు రాజకీయాల్లోనూ రాణించారు.

 Krishna Who Targeted Ntr..that's Why These Films Were Made, Krishna , Sr Ntr, Al-TeluguStop.com

ఎన్టిఆర్ పాట్రీ పెట్టిన కొన్ని నెలలకే సీఎం అయిన విషయం అందరికి తెలిసిందే.ఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పనక్కర్లేదు.

వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో క్రేజ్ ని సంపాదించుకున్నారు.సినిమాల్లో వీరి మధ్య గట్టిపోటీ ఉండేది.

సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా వీరు దూకుడుగా ఉండేవారు.ఎన్టిఆర్ కి ప్రతి విషయంలో కృష్ణ పోటీపడేవారు.

అందుకే ఎన్టిఆర్ ను టార్గెట్ చేసి కొన్ని సినిమాలు కూడా తీశారంట.అవేంటో ఇప్పుడు చూద్దాం.

Telugu Krishna, Kurukshetram, Sr Ntr, Tollywood, Vijaya Nirmala-Movie

ఎన్టిఆర్ కు ఎప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా( Alluri Seetharama Raju ) చేయాలని ఒక కోరిక ఉండేదట.అందుకు ఈ సినిమా కోసం ఎన్టిఆర్ పడాల రామారావుతో డైలాగులు కూడా రాయించారు.కృష్ణ కూడా వెంటనే ఈ సినిమాను పట్టాలపైకి తీసుకెళ్లారు.రామచంద్రరావు అనే దర్శకుడితో సినిమా మొదలు కూడా పెట్టేసారు.అయితే ఆ దర్శకుడు సినిమా మధ్యలో ఉండగా చనిపోగా, మిగితా కథని విజయనిర్మల పూర్తి చేశారు.కృష్ణ కెరీర్ లో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఎంత స్పెషల్ అనేది చెప్పనక్కర్లేదు.

ఆ తరువాత ఎన్టిఆర్ మహాభారతం ఆధారంగా తీసుకొని దానవీరశూరకర్ణ మొదలుపెట్టారు.వెంటనే కృష్ణ ఈ సినిమాకి పోటీ ఇవ్వాలి అనుకున్నారు.

దానవీరశూరకర్ణ సినిమా( Daana Veera Soora Karna )కు పోటీగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కురుక్షేత్ర సినిమా ( Kurukshetram Movie )తీశారు.అంతేకాదు ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం విశేషం.

అయితే ఈ పోటీలో ఎన్టిఆర్ విజయం సాధించారు.కృష్ణ నటించిన కురుక్షేత్ర అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఇక ఎన్టిఆర్ నటించిన దానవీరశూరకర్ణ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

Telugu Krishna, Kurukshetram, Sr Ntr, Tollywood, Vijaya Nirmala-Movie

ఇక ఎన్టిఆర్ రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఈ పోటీ కొనసాగింది.ఎన్టీఆర్ గండిపేట కుటీరం నుంచి కార్యకర్తలు నిర్వహించేవారు.దానికి కృష్ణ వ్యతిరేకంగా గండికోట రహస్యం సినిమా తీశారు.

ఏలూరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అక్కడ టిడిపి నుంచి పోటీ చేసిన బుల్లి రామయ్యను ఉద్దేశించి మాట్లాడుతూ బుల్లి రామయ్య నే కాదు పెద్ద రామయ్య అని కూడా ఓడిస్తానంటూ శపధం చేశారు.అలా ఎప్పుడు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కృష్ణ ఎన్టిఆర్ పై దూకుడుగా ఉండేవారట.

కానీ ఎందుకో అనేది చాలా మందికి తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube