నాగార్జున సాగర్ చేరుకున్న కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​ బోర్డు

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ డ్యామ్ మరమ్మతుల పనులను పర్యవేక్షించడానికి కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​ బోర్డు సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి, అధికారుల బృందం గురువారం నాగార్జున సాగర్ చేరుకున్నారు.

ప్రతి ఏడాది వర్షాకాలం కంటే ముందస్తుగా డ్యాం మరమ్మతుల పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టేది.

కానీ,ఈ ఏడాది మాత్రం ఆంధ్ర,తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదం కారణంగా ఏపీ ఇరిగేషన్ అధికారులు ఏపీ వైపు కుడి కాలువకు సంబంధించిన ఒక గేటు గతంలో కొట్టుకుపోగా ఆ గేటుతో పాటు 8 గేట్లను తెలంగాణ ప్రభుత్వం నూతన మరమ్మతులు చేపట్టింది.ఆ గేట్లపైన బీటీ రోడ్ల మరమ్మతులు,ఇతర పనులను చేయాల్సి ఉంది.ఇక గేట్లు ఉండే క్రేన్‌కు సంబంధించిన పట్టాల పనులు కూడా పూర్తవ్వాల్సి ఉండగా దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఈనెల 16వ తేదీన కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు లేఖ రాసింది.2014 రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ అనంతరం శ్రీశైలం డ్యామ్‌ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌,నాగార్జున సాగర్‌ బాధ్యతలను తెలంగాణ నిర్వహిస్తోంది.వర్షాకాలానికి ముందే సాగర్‌ మరమ్మతులు పూర్తిచేయడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో ఈ బృందం పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Latest Nalgonda News