రణం కంటే రాజీ నయం:కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్మూర్తి

నల్లగొండ జిల్లా:ఇద్దరు కలబడితే ఒక్కరే గెలుస్తారని,రాజీపడితే ఇద్దరూ గెలుస్తారని,కోర్టు కేసుల్లో "రణం కంటే రాజీ మార్గమే" ఉత్తమమని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

క్షణికావేశానికి గురై తప్పనిసరి పరిస్థితుల్లో వివాదాలకు వెళ్ళి నేరాలకు పాల్పడిన వ్యక్తులు కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి ఇంకా కక్షలు పెంచుకోవడం కంటే కలిసి మట్లాడుకొని రాజీ పడటమే రాజమార్గమని పేర్కొన్నారు.

మండలంలో ఈ నెల 28 న జరిగే జాతీయ లోక్ అదాలత్ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదారులు తమ విలును బట్టి తమ తమ కేసులకు రాజీ కుదుర్చుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Kondamallepalli SI Rammurthy Is Better Than Compromise , Kondamallepalli SI Ramm

ఈ లోక్ అదాలత్ లో రాజీ పడటానికి క్రిమినల్, సివిల్,వివాహ,కుటుంబ,ఆక్సిడెంట్,ఎక్సైజ్,ట్రాఫిక్ ఈ చలాన్ కేసులు ఇరుపక్షాల అంగీకారంతో న్యాయమూర్తుల సమక్షంలో పరీక్షించుకోవచ్చన్నారు.ఎన్నో సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరగడం కన్నా రాజు లాగా రాజీ పడడం అందరికీ మేలు చేస్తుందన్నారు.

Advertisement

Latest Nalgonda News