నల్లగొండ జిల్లా:108 ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజిరుద్దీన్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడ్డ బాధితులను ఏ విధంగా అంబులెన్స్ లో చికిత్సలు అందించాలొ,ఎమర్జెన్సీ కేసుల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేశారు.అనంతరం ఔషధాలను వాటి యొక్క నాణ్యతను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం సూపర్వైజర్ మధు, టెక్నీషియన్ వెలిజాల సైదులు,పైలట్ అరుణ్ నాయక్ పాల్గొన్నారు.