ఇదెక్కడి మాస్ అయ్యా, బాబు.. భూమిని బాంబులతో పేల్చి శంకుస్థాపన చేసిన కిమ్ జోంగ్ ఉన్!

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చేసే పనులన్నీ యావత్ ప్రపంచాన్ని ఎప్పుడూ షాక్‌కి గురి చేస్తుంటాయి.తాజాగా ఆయన చేసిన మరొక ఘనకార్యం వల్ల మళ్లీ ప్రపంచం నివ్వెరపోతోంది.

 Kim Jong Un Who Bombed The Earth And Laid The Foundation Stone  , Mass, Viral Ne-TeluguStop.com

ఎప్పుడూ ఏదో ఒక విపరీత చేష్టతో అందరి దృష్టిని ఆకర్షించే కిమ్ ఇప్పుడు వ్యవసాయం బాట పట్టి ఆశ్చర్య పరుస్తున్నాడు.అయితే వ్యవసాయంలోనూ తనదైన మార్క్ చాటుకున్నాడు కిమ్.

తాజాగా ఇతడు ఉత్తర కొరియా దేశంలోని హమ్‌హంగ్ నగరంలో గ్రీన్ హౌస్ వ్యవసాయ క్షేత్రానికి పునాదిరాయి వేశారు.

అయితే పునాది రాయి వేసే ముందు భూమిలో గుంత ఏర్పడేందుకు ఏకంగా బాంబులనే వాడాడు కిమ్! ఈ ప్రాంతంలో మట్టి మంచుతో పేరుకు పోయింది.

దాంతో ఆ మంచును బాంబులతో పేల్చివేశాడు.ఈ ప్రాంతంలో భారీగా మోహరించిన సైనికులు కూడా బాంబులతో హోరెత్తించారు.

ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇదెక్కడి మాస్ అయ్యా, బాబు అని నోరెళ్లబెడుతున్నారు.

వింటర్ సీజన్ లో ఉత్తర కొరియాలో తాజా కూరగాయలు దొరకడం లేదు.దీని వల్ల ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు.కేవలం పచ్చళ్లు, ఎండిన కూరగాయలు తింటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఎలాంటి ప్రతికూల వాతావరణంలో నైనా సంవత్సరం అంతటా పంటలు పండించాలని కిమ్ నిర్ణయించారు.ఇందులో భాగంగా తాజాగా గ్రీన్ హౌస్ వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు.

ఈ ఫామ్ హౌజ్ నిర్మాణం స్థానిక సంస్థల సహకారంతో నిర్మితం కానుంది.దీని సహాయంతో ఏడాదంతా కూరగాయలు పండించవచ్చు.

అయితే మొన్నటి దాకా కిమ్ వరుస క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాల వార్తల్లో నిలిచాడు.ఇప్పుడేమో శంకుస్థాపనకు బాంబులను వాడి మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు.

ఈ వ్యవసాయ క్షేత్రం కన్స్ట్రక్షన్ అనేది ఏడాది అక్టోబర్ 10 నాటికి పూర్తి కావచ్చని సైనికులు తెలిపారు.ఈ తేదీ పార్టీ స్థాపన వార్షికోత్సవం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube