కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతూ కేజిఎఫ్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పటివరకు కేవలం కన్నడ చిత్ర పరిశ్రమకు పరిమితమైన ఈయన కేజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఇకపోతే ఈ సినిమా అనంతరం పలు సినిమాలతో బిజీగా ఉన్నటువంటి యశ్ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజాగా నటుడు యశ్ అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్న విషయం మనకు తెలిసిందే.
అయితే అయోధ్య రామ మందిరం నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ఎంతోమంది భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.ఈ క్రమంలోని హీరో యశ్ సైతం అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్న సమయంలో ఈయన ఆలయ నిర్మాణానికి 50 కోట్ల రూపాయల భారీ విరాళం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది.
ఇప్పటికే హీరో యష్ తన సంస్థ ‘యశోమార్గ’ ద్వారా చాలా మందికి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.అలాగే చెరువులు నదులు పరిరక్షణ భూగర్భ జలాల పెంపుదల కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు.ఇలా ఇప్పటికే సామాజిక సేవలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన అయోధ్య రామ మందిరానికి 50 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారనేది పూర్తిగా ఆవాస్తవమని కొందరు ఈయన ఫోటోని జత చేసి ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారు.
ఈయన నటించిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా విడుదలకు ముందు తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఫోటోని జత చేసి ఈయన అయోధ్య రామ మందిరానికి 50 కోట్లు విరాళం ఇస్తున్నారంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.