టీఆర్ఎస్ ప్రభుత్వం రోజురోజుకు వరుస సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది.అయితే అభివృద్ధిపై చాలా రకాలుగా చర్చలు సాగుతున్న తరుణంలో అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.
అందుకే అభివృద్ధి మొత్తం హైదరాబాద్ లో కేంద్రీకరించడమే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా అభివృద్ధిపై పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.అందుకు హైదరాబాద్ తరువాత పరిశ్రమల ఏర్పాటుకు రెండో అనుకూల నగరంగా వరంగల్ జిల్లాకు టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోన్న పరిస్థితి ఉంది.
దీంతో మంత్రి కేటీఆర్ పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలలో పాల్గొని.వరంగల్ నగరాన్ని కూడా పరిశ్రమల ఏర్పాటుకు పరిశీలించాలని ఇన్వెస్టర్ లకు సలహాను ఇస్తున్న పరిస్థితి నెలకొంది.
అయితే అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టకపోతే హైదరాబాద్ లోనే అభివృద్ధి చేపడితే మిగతా ప్రాంతాల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది.అంతేకాక తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమేనన్న ఒక పేరు కూడా తొలగిపోయే అవకాశం ఉంది.
అయితే ఇంకా రానున్న రోజుల్లో తెలంగాణలో వరంగల్ లాంటి స్థాయి కలిగి ఉన్న కరీంనగర్ లాంటి జిల్లాలలో కూడా కంపెనీలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.

తాజాగా వరంగల్ జిల్లాకు ప్రముఖ ఐటీ దిగ్గజం జెన్ పాక్ట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ కూడా పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన పరిస్థితి ఉంది.ఏది ఏమైనా అన్ని విధాలా ప్రజలకు సమాధానం చెప్పేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటినుండి ప్రతి ఒక్క అడుగులో క్లారిటీతో ముందుకెళ్తోంది.అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన విషయం.
ఏది ఏమైనా టీఆర్ఎస్ చాలా రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధిని పెంపొందించాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పవచ్చు.