చదువుతల్లికి కస్తూరి ఫౌండేషన్ సహకారం

నల్లగొండ జిల్లా:గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన దుంబాల శంకరయ్య కుమార్తె నందిని చదువుల్లో రాణిస్తూ ఎంసెట్(బీ ఫార్మసీ)లో 36,168వ ర్యాంక్ సాధించి, నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాలలో సీట్ సంపాదించింది.

కానీ,తన తండ్రి మెదడు సంబంధిత వ్యాధితో మంచానికే పరిమతమవడంతో ఆర్ధిక సమస్యలతో చదువుకోలేక ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది.

ఒక వైపు తన అనారోగ్యం మరోవైపు తన కూతురి చదువు ఆగిపోవడంతో ఆ పేద తండ్రి ఇంకాస్త మనోవేదనకు గురయ్యాడు.నల్లగొండ కళాశాలలో జాయిన్ కావడానికి గురువారం చివరి రోజు అయినా చేసేదేమీ లేక నిరాశతో ఉన్న నందిని పరిస్థితి చూసి గ్రామానికి చెందిన గుర్రం ప్రదీప్ అనే యువకుడు కస్తూరి ఫౌండేషన్ అధినేత కస్తూరి చరణ్ కి సమాచారాన్ని చేరవేశాడు.తక్షణమే సానుకూలంగా స్పందించిన కస్తూరి చరణ్ ఆర్ధిక సమస్యలతో ఏ ఒక్కరి చదువుకి ఆటంకం కలుగొద్దని భావించి ఫౌండేషన్ సభ్యుడైన నరేందర్ రెడ్డిని ఆ అమ్మాయితో కళాశాలకు పంపి రూ.25000/- ఫీజు చెల్లించి కళాశాలలో జాయిన్ చేశారు.దీనితో మధ్యలోనే తన చదువు ఆగిపోతుందని బాధపడ్డ నందిని మరియు కుటుంబ సభ్యులు కస్తూరి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Kasturi Foundation's Contribution To Eduthalli-చదువుతల్ల�
మహిళల భద్రతకు ప్రత్యేక వాచ్...!

Latest Nalgonda News