కార్గిల్ విజయ్ దివస్.. అమర జవాన్లకు నివాళి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో 25వ కార్గిల్ విజయ్ దివస్‌ కార్యక్రమాన్ని స్వామి వివేకానంద సేవాసమితి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకొని అమరులైన సైనికులకు నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారత సాయుధ దళాల అజేయమైన ఆత్మ, పరాక్రమాన్ని గౌరవించటానికి భారతదేశ చరిత్రలో లిఖించబడిన రోజు కార్గిల్ యుద్ధంలో విజయం భారత సైన్యం ధైర్యసాహసాలకు, తిరుగులేని జాతీయ కర్తవ్యానికి నిదర్శనం.

1999 నాటి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలపై భారత సైన్యం సాధించిన విజయాన్ని స్మరించుకోవడానికి భారతదేశం ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటుంది.ఈ రోజున భారతజాతి గౌరవం కోసం పోరాడిన వీరులను స్మరించుకుంటూ అమరులైన 527 మంది సైనికులకు నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో పాటి సుధాకర్, లోకోజి సతీష్ , గొల్లపల్లి సాయి కృష్ణ, జాల గంగాధర్, కొట్టే రాజు,ఎలమల లక్ష్మణ్, కొట్టే రాహుల్, ఉప్పుల మణికంఠ లక్క వెంకటేష్, లక్క సాయి, కొట్టే వంశీ తదితరులు పాల్గొన్నారు.

సెస్ హెల్పర్ పిల్లలు సర్కార్ బడికి..
Advertisement

Latest Rajanna Sircilla News