రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పరిధిలో ఐ ఎఫ్ సి కోడ్ పొరపాటు వల్ల రైతులకు రుణమాఫీ జరగడం లేదు.ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లిస్టులో తమ పేర్లు ఉండి రుణమాఫీ జరగకపోవడంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఐఓబి బ్యాంకు పరిధిలోని రైతులకు ఐఎఫ్ సి కోడ్ పొరపాటు వల్ల రుణమాఫీ జరగడంలేదని.రైతులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తెచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డికి తెలుపగా దీనిపై వెంటనే స్పందించిన కేకే మహేందర్ రెడ్డి
గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో మాట్లాడి ఐ ఎప్.సికోడ్ విషయంలో చిన్న పొరపాటు జరిగిందని దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ తో కేకే మాట్లాడారు.రుణమాఫీ ఇప్పటికే జాప్యం అయినందున త్వరితగతిన క్లియర్ చేసి రుణమాఫీ చేయాలని కోరారు.
త్వరలో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని అన్ని ఐఓబి బ్యాంకులలో రైతుల రుణమాఫీ సోమవారం వరకు జరుగుతుందని కేకే మహేందర్ రెడ్డి తెలిపారు.రైతుల రుణమాఫీ పై వెంటనే స్పందించిన నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డికి రైతుల పక్షాన మండల కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది.