ఆగస్టు చివరి నాటికి నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా: పేద ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని,జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు ఆగస్టు చివరినాటికి పూర్తి చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.శుక్రవారం ఆయన జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసి కాలనీలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ సి.

 Nalgonda Government Medical College Works To Be Completed By The End Of August M-TeluguStop.com

నారాయణరెడ్డితో కలిసి తనిఖీ చేశారు.అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఆగస్టు చివరి నాటికి పనులను పూర్తి చేసి ప్రభుత్వ వైద్య కళాశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానట్లు తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు,ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గత ఆరు నెలల నుండి వైద్య కళాశాల పనులను వేగవంతం చేశామని చెప్పారు.

ఉస్మానియా,గాంధీ,కాకతీయ తర్వాత ఎక్కువ మంది రోగులు వస్తున్నది నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికేనని, ఈ వైద్య కళాశాల పూర్తయితే విద్యార్థులకు ఎంతో వీలుగా ఉంటుందన్నారు.

ఇప్పటి వరకు 95% పనులు పూర్తయ్యాయని,బాలికల వసతి గృహం సెప్టెంబర్ లో పూర్తవుతుందని,పనులలో నాణ్యత ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను,కాంట్రాక్టర్ ను ఆదేశించారు.రాష్ట్రంలోనే నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను ఉత్తమ, మోడల్ వైద్య కళాశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.వైద్యం కోసం పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూస్తున్నారని,ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి అప్పల పాలవుతున్నారని,

దీనిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామని,నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్యశ్రీ సైతం అమలు చేస్తామని,అన్ని వసతులు కల్పిస్తామని, ముఖ్యంగా సిబ్బందికి ట్రాన్స్పోర్ట్ కోసం రెండు ఏసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.తాగునీరు,.సివిల్ పనులు,విద్యుత్తు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు.నర్సింగ్ కళాశాలకు రూ.20 కోట్లు మంజూరయ్యాయని, నర్సింగ్ కళాశాలను సైతం ఇదే క్యాంపస్ లో నిర్మించనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube