కూతురితో ఉగాది జరుపుకున్న కళ్యాణ్ దేవ్.. వైరల్ అవుతున్న ఫోటోలు?

మెగా డాటర్ శ్రీజ( Sreeja ) తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ కి( Kalyan Dev ) విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.అయితే వీరి విడాకుల విషయం అధికారకంగా ప్రకటించకపోయిన వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని స్పష్టంగా తెలుస్తుంది.

 Kalyan Dev Celebrate Ugadi Festival With His Daughter Navishka Details, Sreeja,-TeluguStop.com

ఈ క్రమంలోనే తన కుమార్తె నవిష్క( Navishka ) ను మాత్రం తన తండ్రి వద్దకు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే నవిష్క తన తండ్రి వద్దకు వచ్చి ఉగాది పండుగను ఇక్కడే జరుపుకున్నారని తెలుస్తుంది.

నెలలో రెండు మూడు సార్లు ఈ చిన్నారి తన తండ్రి వద్దకు వెళుతూ అక్కడ తన తండ్రితో కలిసి సమయం గడుపుతూ ఉంటారు.ఆ ఆనంద క్షణాలను కళ్యాణ్ దేవ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.అయితే ఉగాది పండుగ( Ugadi Festival ) సందర్భంగా నవిష్క కళ్యాణ్ దేవ్ వద్దకు రావడంతో ఈయన ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నారని తెలుస్తుంది.అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ విధంగా తన కుమార్తెతో పాటు తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ శ్రీ క్రోధి దినామ ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటూ ఈ ఫోటోలను షేర్ చేయక ఒకసారిగా వైరల్ అయ్యాయి.ఇలా పండుగ పూట తన కుమార్తె తన ఇంటికి రావడంతో కళ్యాణ్ దేవ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ ఫోటోలలో ఈ చిన్నారి చాలా సాంప్రదాయ బద్ధంగా పట్టు పరికిణి ధరించి కనిపించారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఒకప్పుడు హీరోగా పలు సినిమాలలో నటించినటువంటి కళ్యాణ్ ఎప్పుడైతే శ్రీజకు దూరమయ్యారో అప్పటినుంచి ఈయన ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటూ ఇతర వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube