కాలుష్య నివారణపై జీడిమెట్ల రవీందర్ చైతన్య సైకిల్ యాత్ర

నల్లగొండ జిల్లా:కాలుష్యం బారి నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులందరి దని ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్ అన్నారు.

మునుగోడు మండలం కొంపెల్లి గ్రామం నుండి కాలుష్య నివారణపై చైతన్య సైకిల్ యాత్రను శనివారం త్రివర్ణ పతాకంతో జండా ఊపి రవీందర్ మాతృమూర్తి ఎల్లమ్మ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాత్రను మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాలు చుట్టి డిసెంబర్ 02 న జరిగే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ లో అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు.కొంపెల్లి,చీకటిమామిడి, పలివేలలోని స్వతంత్ర సమరయోధులు,పర్యావరణవేత్త కొండవీటి గురునాథరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ మునుగోడు మీదుగా చండూరు మండలానికి యాత్ర బయలు దేరుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈరిగి విజేందర్,డోకూరి వేణుగోపాల్ రెడ్డి, బోయపర్తి సురేందర్,సునీల్ పుట్టపాక,నెల్లికంటి యాదయ్య, వీరమల్ల గోపాల్,జీడిమెట్ల సైదులు,మోగుదాల రాజు, ఆనగంటి కృష్ణ,గజ్జల బాలరాజ్,గోస్కొండ చంద్రయ్య, గోల్కొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!
Advertisement

Latest Nalgonda News