ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో , ప్రధాన పార్టీలైన టిడిపి , జనసేన, వైసిపి, బిజెపిలు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.ఇప్పటికే అధికార పార్టీ వైసిపి అభ్యర్థులు ఎంపికలు చేస్తూ, భారీగా ప్రక్షాళనకు తెరతీసింది.
నియోజకవర్గ ఇన్చార్జిలను పెద్ద ఎత్తున జగన్( Jagan ) మారుస్తున్నారు.ఇక టిడిపి, జనసేన కూడా ఈ విషయంలో దూకుడు పెంచాలని నిర్ణయించాయి.
ఈ రెండు పార్టీలు ఇప్పటికే పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో, సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రత్యేకంగా బేటి అయ్యారు.ఈ భేటీలో జనసేనకు 27 అసెంబ్లీ , రెండు లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం.
అయితే ఇంకా ఈ రెండు పార్టీలు అధికారికంగా దీనిపై ప్రకటన చేయలేదు.
అనకాపల్లి, మచిలీపట్నం లోక్ సభ స్థానాలు జనసేనకు( Janasena ) కేటాయించేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారట.ఇక రాజంపేట సీటు పైన జనసేన పట్టుబడుతుండడంతో , దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అసెంబ్లీ స్థానాలపై ఒక క్లారిటీ కి రావడంతో , త్వరలోనే జనసేన తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేసేందుకు నిర్ణయించుకుంది.
పవన్ కళ్యాణ్ భీమవరం తో పాటు, తిరుపతిలోనూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.అయితే దీనిపై ఇంకా ఫైనల్ గా నిర్ణయం తీసుకోలేదు ఇప్పటివరకు ఫైనల్ చేసిన జాబితాలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
నెలిమర్ల లోకం నాగ మాధవి,( Nellimarla Lokam Naga Madhavi ) గజపతిపురం పడాల అరుణ,( Gajapatipuram Padala Aruna ) గాజువాక సుందరపు సతీష్ , భీమిలి పంచకర్ల సందీప్ లేదా పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు , యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, ముమ్మిడివరం పితాని బాలకృష్ణ పేర్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అలాగే రాజానగరం బత్తుల బాలరామకృష్ణ, రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ పంతం నానాజీ, పిఠాపురం టీ టైం ఉదయ్ శ్రీనివాస్ ,రామచంద్రపురం చిక్కం దొరబాబు, జగ్గంపేట పాటింశెట్టి సూర్యచంద్రరావు , రాజోలు డిఎంఆర్ శేఖర్, భీమవరం పవన్ కళ్యాణ్, తణుకు విడువాడ రామచందర్రావు ,తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ ,నరసాపురం బొమ్మిడి నాయకర్ , విజయవాడ వెస్ట్ పోతిన మహేష్, తెనాలి నాదెండ్ల మనోహర్, గిద్దలూరు ఆమంచి శ్రీనివాసరావు పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ జాబితా పై జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.