సేవాలాల్ జయంతి కరపత్రాలు ఆవిష్కరించిన మాజీ మంత్రి జానారెడ్డి

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ హిల్ కాలనీ సేవాలాల్ మహారాజ్ ప్రాంగణంలో ఈ 25 న జరుపనున్న 285 వ శ్రీ సంత్ సేవాలాల్ జయంతి కరపత్రాలను బుధవారం మాజీ మంత్రి జానారెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ ఒక్క బంజారాలకే కాదని, అందరినీ ఏకం చేసిన ఘనుడని,సేవాలాల్ మహారాజ్ అహింసవాది, ఒక పశువును బలి ఇస్తుంటే నన్ను బలి ఇవ్వమన్న వ్యక్తి అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నియోజవర్గ అధ్యక్షుడు ధనావత్ భాస్కర్ నాయక్,గౌరవ అధ్యక్షుడు రమావత్ శంకర్ నాయక్,సక్రు నాయక్,పాండు నాయక్, మేరావత్ మునినాయక్, చందు లాల్,మోహన్ నాయక్,మంగ్త నాయక్, భీలు నాయక్,సర్దార్ నాయక్,నాగేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రేపు వైన్ షాపులు మాంసం దుకాణాలు బంద్

Latest Nalgonda News