ఆర్ఆర్ఆర్ మూవీలో ఇంత పెద్ద తప్పెలా చేశావ్ జక్కన్నా.. కనిపించలేదా అంటూ?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదలై రెండు నెలలైనా ఈ సినిమా గురించి చర్చ జరుగుతూనే ఉంది.ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి రావడంతో థియేటర్లలో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ఓటీటీలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ సినిమాను చూసి ఈ సినిమాకు సంబంధించి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

 Jakkanna Huge Mistake In Rrr Movie Details, Rajamouli, Rrr Movie, Rrr Movie Mist-TeluguStop.com

ఓటీటీలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

అయితే ఒక విషయంలో మాత్రం రాజమౌళిపై ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో తప్పుల గురించి కొంతమంది నెటిజన్లు జక్కన్నను తెగ ట్రోల్ చేస్తున్నారు.కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్ వాడిన బైక్ నంబర్ ఒక్కో సీన్ ఒక్కో విధంగా ఉండటంతో నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి.

అయితే ఇప్పుడు మాత్రం ఇంటర్వెల్ ఫైట్ సీన్ గురించి చర్చ జరుగుతోంది.

జంతువులు పై నుంచి కిందికి దూకే సీన్ సినిమాకు హైలెట్ సీన్లలో ఒకటి.

Telugu Intervel Scene, Ntr, Rajamouli, Ram Charan, Rrr, Rrr Ott, Tiger Deers-Mov

అయితే ఒకే బోనులో పులులు, జింకలు ఉండటం ఏమిటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.జక్కన్నకు కళ్లు కనిపించట్లేదా అంటూ నెటిజన్ల నుంచి వ్యంగ్యంగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జక్కన్న ఈ కామెంట్ల గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.ఇది చిన్న తప్పు అయితే కాదని నెటిజన్లు చెబుతున్నారు.

Telugu Intervel Scene, Ntr, Rajamouli, Ram Charan, Rrr, Rrr Ott, Tiger Deers-Mov

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత చాలా ఆలస్యంగా థియేటర్లలో విడుదలైందని అంత సమయం దొరికినా సినిమాలో తప్పులు ఉన్నాయంటే ఇది రాజమౌళి నిర్లక్ష్యానికి నిదర్శనమని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజమౌళి గత సినిమాలలో కూడా ఈ తరహా తప్పులు కొన్ని ఉన్నాయి.భారీ బడ్జెట్ సినిమాలనూ తెరకెక్కించే రాజమౌళి ఈ తరహా తప్పులు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube