రవితేజ తప్పుకోవడంతో ఆ తేదీ ఖాళీ.. ఎవరైనా ఉన్నారా?

కరోనా వల్ల నిలిచి పోయిన సినిమాలు ఇప్పుడు విడుదల అవుతున్నాయి.షూటింగ్‌ లు పూర్తి అయిన సినిమాలను కూడా ఇప్పుడే విడుదల చేస్తున్నారు.

దాంతో వారంకు మూడు నాలుగు సినిమా ల చొప్పున బాక్సాఫీస్‌ వద్ద దాడి అన్నట్లుగా తెలుగు సినిమా లు బ్యాక్ టు బ్యాక్‌ వస్తున్నాయి.పెద్ద సినిమా లకు పోటీ లేకుండా చిన్న సినిమా లు తప్పుకుంటున్నాయి.

చిన్న సినిమా లు సోలో గా రావడం కష్టంగా ఉంది.మూడు నాలుగు చిన్న సినిమా లు ఒకే వారంలో వస్తున్నాయి.

ఇలా రెండు మూడు నెలల క్రితమే సినిమా ల విడుదలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకున్నారు.ఇప్పుడు సినిమాల విడుదల తేదీలో కాస్త అటు ఇటు అయినా కూడా చాలా సినిమాల విడుదల గందరగోళం గా మారుతుంది.

Advertisement

పెద్ద సినిమాలు ఒక తేదీ కాదని మరో తేదీన వస్తే అప్పుడు ఆ తేదీలో రావాల్సిన సినిమాలు బొక్క బోర్లా పడ్డట్లే.ఇప్పుడు రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా విషయంలో ఏదో జరుగుతుంది.

జూన్‌ రెండవ వారంలో విడుదల చేస్తాం అంటూ చెప్పిన వారు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చేసుకున్నారు.ఇప్పుడు సినిమాను విడుదల చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఆ తేదీలో రామారావు ఆన్ డ్యూటీ మాత్రమే విడుదల అవ్వాల్సి ఉంది.కాని ఇప్పుడు ఆ తేదీ ఖాళీగా ఉంది.

చాలా సినిమాలు విడుదల తేదీ విషయంలో ఎదురు చూస్తూ ఉంటే ఒక మంచి తేదీ ని మిస్ చేసుకుని రామా రావు తప్పు చేశాడు అంటున్నారు.విడుదల తేదీకి ఎక్కువ సమయం లేదు కనుక పెద్ద సినిమాలకు అవకాశం లేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

చిన్న సినిమా లు అయినా రెండు మూడు ఆ తేదీ లో వస్తాయేమో చూడాలి. విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఆ తేదీన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు