జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారా అంటే అవుననే వాదనలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.గత ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించడంలో ఆయన ప్రకటించిన నవరత్నాలు ముఖ్య భూమిక పోషించయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సంక్షేమమే ధ్యేయంగా జగన్ రూపొందించిన నవరత్నాలు ( తొమ్మిది హామీలు ) ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.గంపగుత్తున వైసీపీకి( YCP ) ఓటు వేయడంలో కీలక పాత్ర పోషించాయి.
ఇప్పుడు పవన్ కూడా సేమ్ అదేవిధంగా మాస్టర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.అయితే వైఎస్ జగన్( YS Jagan ) సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాలను రూపొందిస్తే.
పవన్ మాత్రం అభివృద్దే ధ్యేయంగా షణ్ముఖ వ్యూహం పేరుతో ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లెలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
షణ్ముఖ వ్యూహంలో భాగంగా.ప్రస్తుతం రాజధాని విషయంలో నెలకొన్న అసంబద్దతను తొలగించేలా అమరావతి( Amaravati )నే రాజధానిగా కొనసాగించడం, యువత ను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, చిరు వ్యాపారులకు రూ.10 లక్షలు అర్హ్తిక సాయాన్ని అందించడం, ప్రతి ఏటా ఉద్యోగ రూపకల్పన చేయడం, చిన్న పరిశ్రమలకు చేయూతనివ్వడం, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి సంపన్న ఏపీకి రాష్ట్రాన్ని తీర్చి దిద్దడం.ఈ ఆరు అంశాలతో ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్ళేలా పవన్ సిద్దమతున్నారట.
అంతే కాకుండా ఈ అంశాలను ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించేలా పవన్, చంద్రబాబు( Chandrababu naidu ) చర్చించినట్లు సమాచారం.ఇప్పటికే మినీ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు కొన్ని హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.పైగా కేవలం అభివృద్దే లక్ష్యంగా పవన్ ప్రతిపాధిస్తున్న షణ్ముఖ వ్యూహం ప్రజలను ఎంతవరకు ఆకర్షిస్తుందనేది చెప్పలేని పరిస్థితి.
ఎందుకంటే సంక్షేమనికి అలవాటు పడ్డ ప్రజలు సంక్షేమ పథకాలనే ఆశిస్తారనేది కొందరి వాదన.అందువల్ల జగన్ నవరత్నాల వ్యూహం ఫలించినట్లుగా.పవన్ షణ్ముఖ వ్యూహం ఫలించే అవకాశాలు తక్కువ అనేది కొందరి అభిప్రాయం.