పోలీస్ ఈవెంట్స్ లో ముగ్గురు మృతి చెందడం దారుణం

నల్లగొండ జిల్లా:పోలీసు నియామక ఈవెంట్స్ లో మృతి చెందిన అభ్యర్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జీ ప్రయదర్శిని మేడి డిమాండ్ చేశారు.

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు మేరకు గురువారం నకిరేకల్ పట్టణంలో పోలీస్ నియామకాలలో ఈవెంట్స్ కి హాజరై మృతి చెందిన అభ్యర్థులు ఎల్.

మహేష్,బి.రాజేందర్,ఎం.

సతీష్ లకు నివాళులర్పించి,వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.అనంతరం ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఈవెంట్స్ లో తీసుకున్న నిర్ణయం కారణంగా ముగ్గురు అభ్యర్థులు చనిపోయారని,వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.మృతి చెందిన అభ్యర్థుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియోతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే లాంగ్ జంప్ ను నాలుగు మీటర్ల నుండి 3.8 మీటర్లకు తగ్గించాలని, రన్నింగ్,షాట్ పుట్ లో క్వాలిఫై అయిన వారిని మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వాలన్నారు.పోలీస్ ఈవెంట్స్ విషయంలో కేసీఆర్ వెంటనే స్పందించాలని,లేకపోతే నిరుద్యోగులే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,ఉపాద్యక్షులు పావుర నరసింహ యాదవ్,రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్,బిఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!
Advertisement

Latest Nalgonda News