ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహిళా మణులకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలలో రాజకీయాల్లో వ్యాపారాలలో మగవారితో సమానత్వ విలువను కల్పిస్తున్నరని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని 30 వ వార్డులో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆమె ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

International Womens Day Celebrated Grandly In Suryapet Details, International W

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో మహిళలను గుర్తించి ఉన్నతమైన పదవులిచ్చి మహిళలకు గౌరవమిచ్చారని అన్నారు.ప్రతి మహిళ మగవారికి ధీటుగా ధైర్య సాహసలతో ప్రతి దానిలో ముందుండాలని పిలుపునిచ్చారు.అనంతరం 30 మరియు 43 వార్డులోని మహిళా మణులను శాలువాలతో సత్కరించారు.

International Womens Day Celebrated Grandly In Suryapet Details, International W

ఈ కార్యక్రమంలో 40వ వార్డు కౌన్సిలర్ తహేర్ పాషా,కో ఆప్షన్ నెంబర్ బత్తుల ఝాన్సీ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయి, వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

Latest Suryapet News