దేశంలోని స్టార్ డైరెక్టర్లలో ఎక్కువ పారితోషికం తీసుకునే దర్శకునిగా రాజమౌళికి పేరుంది.ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ తో పాటు లాభాలు కూడా తీసుకుంటారని అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
సాధారణంగా దర్శకులు హీరోల డేట్ల కోసం కష్టపడితే రాజమౌళి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది.రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించినా ఊహించని స్థాయిలో క్రేజ్ దక్కుతుందని ఎంతోమంది భావిస్తున్నారు.
రాజమౌళి సినిమాలలో నటించిన తర్వాత అవకాశాలు పెరిగిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు.ఎంతోమంది నటులకు పాన్ ఇండియా నటులుగా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా గుర్తింపు రావడానికి రాజమౌళి కారణమయ్యారు.
తెలుగు సినిమాలతో కూడా వేల కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించవచ్చని రాజమౌళి తన సినిమాలతో ప్రూవ్ చేశారు.అపజయం ఎరుగని దర్శకధీరుడు రాజమౌళికి సినిమాసినిమాకు పారితోషికం పెరుగుతోంది.
తన రెమ్యునరేషన్ తో రాజమౌళి గతంలో భూములు కొనుగోలు చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే జక్కన్న దానాలు చేసే విషయంలో మాత్రం వెనుకుంటారు.జక్కన్న ఎక్కువ మొత్తంలో దానాలు చేయకపోవడం వల్ల కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా జక్కన్నను ట్రోల్ చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి.
అయితే దర్శకుడిగా గుర్తింపు రాకముందు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు, ఆర్థిక కష్టాలు రాజమౌళి ఈ విధంగా దానాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కారణమని సమాచారం.జల్సాలు, దురలవాట్లకు కూడా రాజమౌళి చాలా దూరమనే విషయం తెలిసిందే.ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
రాజమౌళి బాహుబలి బాహుబలి2 సినిమాలతో సృష్టించిన కలెక్షన్ల రికార్డులు ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండగా ఆ రికార్డులు బ్రేక్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.