రీసెంట్ సమయం లో విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకొని , విడుదలకు తర్వాత ఆ అంచనాలకు మించి రెస్పాన్స్ ని దక్కించుకున్న చిత్రం ‘బేబీ'( Baby ).ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని అద్భుతమైన ఓపెనింగ్స్ ని దక్కించుకుంది.
ఇక పోతే ఈ సినిమాలో హీరో గా నటించిన ఆనంద్ దేవరకొండ,టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు అనే విషయం అందరికీ తెలిసిందే.ఇక వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) కూడా పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్ కి సుపరిచితమే, కానీ సెకండ్ హీరో గా నటించిన విరాజ్ అశ్విన్ గురించి మాత్త్రం ఎవరికీ తెలియదు.
అయితే అతనికి సంబంధించిన కొన్ని వివరాలు మీకోసం ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము చూడండి.
విరాజ్ అశ్విన్( Viraj Ashwin ) ఈ చిత్రానికి ముందే ‘అనగనగా ఓ ప్రేమ కథ’ అనే చిత్రం ద్వారా హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.ఈ చిత్రం లో ఆయన హీరో గా నటించడమే కాదు, దర్శకత్వం కూడా వహించాడు.కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు, ఇక ఆ తర్వాత అనసూయ తో కలిసి ‘థాంక్యూ బ్రదర్'( Thank You Brother ) అనే చిత్రం లో నటిస్తాడు.
ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీ లోనే విడుదల అయ్యింది.రెస్పాన్స్ పరంగా పర్వాలేదు అనే రేంజ్ ని దక్కించుకుంది ఈ చిత్రం.ఇక ఆ తర్వాత ఈ హీరో నటించిన ‘మనసానమః'( Manasanamaha ) అనే షార్ట్ ఫిలిం లో నటించాడు.16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిం ఒక సెన్సేషన్ సృష్టించింది.గత ఏడాది విడుదలైన ఈ షార్ట్ ఫిలిం కి 513 అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చాయి.
ఆ స్థాయిలో అవార్డ్స్ ని దక్కించుకున్న మొట్టమొదటి షార్ట్ ఫిలిం గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది.ఈ విషయం చాలా మందికి తెలియదు.అలాంటి రికార్డు ఉన్నప్పటికీ ఇతగాడికి అవకాశాలు పెద్దగా రాలేదు.
ఈ షార్ట్ ఫిలిం తర్వాత ఆయన హీరోగా నటించిన ‘మాయాపేటిక'( Mayapetika ) అనే చిత్రం ఈ మధ్యనే విడుదలై డిజాస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.కానీ రీసెంట్ గా విడుదలైన ‘బేబీ’ చిత్రం మాత్రం విరాజ్ అశ్విన్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అని చెప్పుకోవచ్చు.
ఈ చిత్రం తర్వాత ఆయనకీ అవకాశాలు కూడా భారీ గానే ఉంటాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.
మరో విశేషం ఏమిటంటే విరాజ్ అశ్విన్ తన చిన్న తనం లో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో తిరుగుతున్నాయి.అంటే ఇతగాడి తండ్రి ఇండస్ట్రీ కి బాగా దగ్గర పరిచయం ఉన్నవాడు అనుకోవచ్చు.