ద‌స‌రాలోపు ఇందిరమ్మ ఇండ్ల క‌మిటీలు:సీఎం రేవంత్ రెడ్డి

నల్లగొండ జిల్లా:ద‌స‌రాకు ఇందిర‌మ్మ ఇండ్ల( Indiramma Housing scheme ) క‌మిటీలు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విధి, విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో బుధవారం సాయంత్రం ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వహించారు.

ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఒక్కటి రెండు రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని సూచించారు.అర్హులైన లబ్ధిదారులకు ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )అన్నారు.

ప్రధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు ల‌క్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయించుకుంటే మన రాష్ట్రం వెనుక‌బ‌డి ఉంద‌ని,ఈ సారీ కేంద్రం మంజూరు చేసే ఇళ్లల్లో రాష్ట్రానికి గ‌రిష్ట సంఖ్యలో సాధించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

Advertisement

Latest Nalgonda News