బ్రిటన్ ప్రధాని రిషి సునాక్( Rishi Sunak ) కేబినెట్‌లో సీనియర్ మంత్రిగా వున్న భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో .
యూకేలో పాలస్తీనా మద్ధతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు.అయితే ఈ ర్యాలీలను పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం, ఏకపక్షంగా వ్యవహరించడంపై హోంమంత్రిగా వున్న సుయెల్లా మండిపడ్డారు.
ఈ ర్యాలీని విద్వేష కవాతుగా అభివర్ణించారు.దీంతో సొంత పార్టీ నుంచే సుయెల్లాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఆమెను పదవి నుంచి తొలగించాలని ప్రధాని సునాక్‌పైనా పలువురు ఒత్తిడి తీసుకొచ్చారు.తప్పనిసరి పరిస్థితుల్లో సుయెల్లాపై వేటు వేశారు రిషి.
ఆమె స్థానంలో జేమ్స్ క్లెవర్లీ( James Cleverly ) యూకే హోంమంత్రిగా నియమితులవ్వగా.బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌ను విదేశాంగ శాఖ మంత్రిగా నియమించి సునాక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

భారత మూలాలు వున్నప్పటికీ సుయెల్లా ఏనాడూ ఇండియాకు అనుకూలంగా మాట్లాడలేదు.ముక్కుసూటి తనంతో ఆమె పలుమార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు.2022లో భారత్‌తో యూకే వాణిజ్య ఒప్పందంపై సుయెల్లా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఎందుకంటే ఇది ఇండియా నుంచి యూకేకు వలసలను పెంచుతుందని ఆమె భయం.బ్రిటన్‌లో వీసా గడువు దాటిన వారిలో అత్యధిక శాతం మంది భారతీయులేనని బ్రేవర్‌మాన్ ( Suella Braverman )ఘాటు వ్యాఖ్యలు చేసింది.భారత్‌తో ఓపెన్ డోర్ పాలసీని కలిగి వుండటంపై సంకోచంగా వుందని ఆమె అప్పట్లో పేర్కొంది.
అంతేకాదు.స్టూడెంట్ వీసా ఆంక్షలను సైతం కఠినతరం చేస్తానని సుయెల్లా భారతీయ విద్యార్ధులను భయపెట్టారు.
ఆమె వైఖరిపై యూకేలో స్థిరపడిన భారతీయ సమాజం భగ్గుమంది.

ఇప్పుడు యూకే హోంమంత్రిగా సుయెల్లాను తప్పించడంపై బ్రిటన్‌లోని భారతీయులు, అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.యూకే హోంమంత్రి స్థాయిలో వున్న నాయకురాలి నోటి వెంట వచ్చే మాటలపై అప్రమత్తంగా వుండాలని స్వాన్సీ వర్సిటీలో చదువుతున్న విద్యార్ధిని తన్వీ కపూర్ అన్నారు.సుయెల్లా స్వయంగా భారత సంతతికి చెందిన వ్యక్తే అయినా , ఈ తరహా ఆరోపణలు చేయడం సరికాదని.
ఇకపై ఆమె హోంమంత్రి స్థానంలో వుండకపోవడం ఆనందంగా వుందన్నారు.భారత్‌కు చెందిన పాలక్ వోహ్రా మాట్లాడుతూ.తాను ఈ ఏడాది భారత్‌కు వెళ్లి, మళ్లీ బ్రిటన్ తిరిగి రావాలని ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు.ఇలాంటి పరిస్ధితుల్లో ప్రధాని రిషి సునాక్ తీసుకున్న నిర్ణయం సరైనదని ప్రశంసించారు.
సుయెల్లాను తొలగించి ఆయన మంచి పని చేశారని పాలక్ అన్నారు.అలాగే శరణార్ధులు, వలసదారుల పట్ల సుయెల్లా కఠినంగా వ్యవహరిస్తుండటం పట్ల ఢిల్లీలో వుంటున్న ఆమె బంధువు ఫాదర్ ఐరెస్ ఫెర్నాండెజ్ స్పందించారు.
నువ్వు కూడా వలస వచ్చినవారి బిడ్డవేనని.శరణార్ధులు, వలసదారుల పట్ల కఠినంగా వుండటం మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
వలసదారులకు పుట్టిన బిడ్డనన్న సంగతిని సుయెల్లా గుర్తుంచుకోవాలని ఐరెస్ పేర్కొన్నారు.ఈ విషయంలో ఆచితూచి మాట్లాడాలని ఆయన గతంలో హితవు పలికారు.