మహిళ మరణానికి కారణమైన నేరంపై భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్‌కు యూకే కోర్ట్ 18 నెలల జైలు శిక్ష విధించింది.వివరాల్లోకి వెళితే.
లండన్‌లో స్థిరపడిన దుష్యంత్ పటేల్ (67)కు ఫార్మా రంగంలో 40 ఏళ్లకు పైగా అనుభవం వుంది.ఈ క్రమంలో ఆయన 2020లో అలీషా సిద్ధిఖీ అనే మహిళకు క్లాస్ సి డ్రగ్స్ సరఫరా చేశాడు.
అయితే ఆగస్ట్ 2020లో ఇంగ్లాండ్‌లోని నార్విచ్‌లో అలీషా శవమై కనిపించింది.దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.
ఆమె మరణించిన దాదాపు నాలుగు నెలల తర్వాత పటేల్‌ను అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.అతను మాదకద్రవ్యాల నేరానికి పాల్పడినట్లు నార్విచ్ ఈవినెంగ్ న్యూస్ తన కథనంలో తెలిపింది.
టాక్సికాలజీ రిపోర్ట్‌లో అలిషా అధిక మోతాదులో మందులు తీసుకోవడం వల్లే చనిపోయిందని తేలింది.అలాగే ఆమె 2020 జనవరి నుంచి ఆగస్ట్ మధ్యకాలంలో దుష్యంత్ పటేల్‌తో తరచుగా ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
అలీషాకు పటేల్ ఎలాంటి ప్రిస్రిప్షన్ లేకుండా జోల్పిడెమ్, జోపిక్లోన్ మందులను సరఫరా చేసినట్లు పోలీసులకు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.ఈ నేరానికి గాను దుష్యంత్‌ను దోషిగా తేల్చిన న్యాయమూర్తి ఆలిస్ రాబిన్సన్.
పటేల్‌కు 18 నెలల జైలు శిక్ష విధించారు.తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.
పటేల్‌కు వున్న 40 ఏళ్ల అనుభవాన్ని బట్టి బాధితురాలు డ్రగ్స్‌కు బానిస అయినట్లు గుర్తించాల్సి వుందన్నారు.డ్రగ్స్ సరఫరా చేసినందుకు గాను దుష్యంత్ డబ్బు అందుకుంటున్నాడని ప్రాసిక్యూషన్ తెలిపింది.
ఇదిలావుండగా… రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడితో పాటు ఓ గర్భవతిని పొట్టనబెట్టుకున్న భారత సంతతి డ్రైవర్‌కు డిసెంబర్ 9న యూకే కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.నిందితుడిని నితేష్ బిసెండరీ (31)గా గుర్తించారు.అతను ఈ ఏడాది ఆగస్ట్ 10న ఇంగ్లాండ్‌లోని రామ్‌స్‌గేట్‌లోని లియోపోల్డ్ స్ట్రీట్‌లో ప్రయాణిస్తుండగా తన ఆల్ఫా రోమియో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.దీంతో అది రోడ్డుపై వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో యోరామ్ హిర్ష్‌ఫెల్డ్ (81), అతని కుమార్తె నోగా సెల్లా (37) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదం జరిగే నాటికి ఆమె నిండు గర్భిణి.
ఇదే ఘటనలో కారులోనే వున్న సెల్లా భర్త , వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
.