అమెరికాలో భారత సంతతి వ్యాపార వేత్త కాల్చివేత.. అనుమానితుడు ఆత్మహత్య

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని న్యూపోర్ట్ నగరంలో( Newport City ) 46 ఏళ్ల భారత సంతతికి చెందిన మోటెల్ (motor + hotel) యజమాని దారుణహత్యకు గురయ్యాడు.ఓ నిరాశ్రయుడే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.

 Indian-origin Motel Owner Shot Dead By Homeless Trespasser In Us Details, Indian-TeluguStop.com

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకునేసరికి మోటెల్ వెలుపల సత్యన్ నాయక్( Satyen Naik ) తుపాకీ గాయాలతో కనిపించాడు.తొలుత 911 కాల్ సెంటర్‌కు హోస్టెస్ హౌస్‌‌లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించినట్లుగా కాల్ వచ్చినట్లు న్యూపోర్ట్ పోలీస్ చీఫ్ కీత్ లూయిస్ తెలిపారు.

కాసేపటికే అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయని మరో కాల్ వచ్చింది.దీంతో క్షణాల్లోనే అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారని ది న్యూస్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.

Telugu America, Carteret Care, Gun, Homeless, Hostess, Indian Origin, Kellum, Mo

తీవ్రంగా గాయపడిన సత్యన్ నాయక్‌ను అత్యవసర వైద్య చికిత్స కోసం కార్టెరెట్ హెల్త్‌కేర్‌కు( Carteret Health Care ) తరలించగా.అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.సత్యన్ నాయక్ కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాన్ని చూసుకుంటున్నారు.పోలీసుల రాకను గమనించిన అనుమానితుడు ట్రాయ్ కెల్లమ్‌ హోస్టెస్ హౌస్‌లోని ఓ గదిలో దాక్కొన్నాడు.పోలీసులు లోపలికి రాకుండా గదికి అడ్డంగా బారికేడ్లు పెట్టాడని లూయిస్ తెలిపారు.

Telugu America, Carteret Care, Gun, Homeless, Hostess, Indian Origin, Kellum, Mo

అయితే స్పెషల్ రెస్పాన్స్ టీమ్( Special Response Team ) అతనిని చాకచక్యంగా అదుపులోకి తీసుకునేందుకు తీవ్రంగా యత్నించినట్లు పోలీస్ చీఫ్ చెప్పారు.నిరాశ్రయుడు కావడంతో హోస్టెస్ హౌస్, ఇతర ప్రదేశాలలో వుండేందుకు యత్నించినట్లు వెల్లడించారు.ఎస్ఆర్‌టీ బృందానికి చెందిన ప్రతినిధులు.

అనుమానితుడిని ఒప్పించి బయటకు రప్పించేందుకు ప్రయత్నించడంతో చాలాగంటల పాటు సందిగ్థత నెలకొంది.కెల్లుమ్( Kellum ) ఎంతకూ బయటకు రాకపోవడంతో ఎస్ఆర్టీ బృందం గదిలోకి ప్రవేశించాలని నిర్ణయించింది.

అయితే స్పెషల్ రెస్పాన్స్ టీమ్‌ లోపలికి ప్రవేశించగానే అనుమానితుడు హ్యాండ్ గన్‌తో తనను తాను కాల్చుకోవడంతో కెల్లమ్ సంఘటనాస్థలిలోనే మరణించినట్లు లూయిస్ వెల్లడించారు.ఈ ఘటనతో అమెరికాలో నిరాశ్రయుల సంక్షోభం, వారి నుంచి సమాజానికి ఎలాంటి ముప్పు పొంచి వుందో తెలియజేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube