యూకే( UK )లోని భారతీయ సంతతికి చెందిన 49 ఏళ్ల దేవన్ పటేల్ కొన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు.అయితే ఇప్పుడు ఈ ఎన్నారై తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నాడు.
తన డ్రగ్స్ వ్యసనానికి( Drug Addiction ) డబ్బులు సమకూర్చమని తన తల్లిదండ్రులను బలవంతంగా, మానసికంగా బ్లాక్ మెయిల్ చేసిన ఇతడిని యూకే పోలీసులు తాజాగా కటకటాల వెనక్కి నెట్టారు.పటేల్ తన తల్లిదండ్రులను కలవకుండా పోలీసులు ఇంతకుముందే నిషేధ ఉత్తర్వులను జారీ చేశారు.
అయితే వాటిని దేవన్ ఉల్లంఘించాడు.
తల్లిదండ్రులు తమ కుమారుడి చర్యల వల్ల అవమానంగా ఫీలయ్యారు.
చివరికి తీవ్ర నిరాశకు గురయ్యారు.అయినా డ్రగ్స్ కి బానిసైన సదరు కొడుకు కనికరం లేకుండా డబ్బును ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు, అతని తల్లిదండ్రులకు రోజుకు 10 సార్లు ఫోన్ చేశాడు.
వారు సమాధానం ఇవ్వకపోతే వారి ఇంటికి కూడా వెళ్లాడు.వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్ట్( Wolverhampton Crown Court ) పటేల్ తన మాదకద్రవ్యాల అలవాటును కొనసాగించడానికి డబ్బు కోసం తన తల్లిదండ్రుల జీవితాలను ఎలా దుర్భరం చేసాడో వివరించింది.
2009, 2013లలో దేవన్ తన తల్లిదండ్రులను కలవకుండా ఉత్తర్వులను అధికారులు జారీ చేశారు.అయితే అతను వోల్వర్‌హాంప్టన్ ఇంటిలో నివాసముంటున్న వారిని కలిసి మరో మూడుసార్లు ఆదేశాలను ఉల్లంఘించాడు.తనకి £28 ఇచ్చే వరకు పేరెంట్స్ పై ఒత్తిడి చేశాడు.పటేల్ తల్లిదండ్రులు చివరికి అతనికి డబ్బు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.అంతేకాకుండా పోలీసులకు తెలియజేయాలని నిశ్చయించుకున్నారు.దాంతో ఇప్పుడు పటేల్ కార్డిఫ్ జైలు( Cardiff Prison )లో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వచ్చింది.
పటేల్‌కు నిజాయితీ లేకపోవడం, షాపుల దొంగతనం, దొంగతనం వంటి నేరాల చరిత్ర ఉంది.జనవరి 21, 25, 27 తేదీల్లో నిషేధాజ్ఞను ఉల్లంఘించినట్లు అతను అంగీకరించాడు.
పటేల్‌కు శిక్ష విధిస్తూ, న్యాయమూర్తి జాన్ బటర్ఫీల్డ్ కెసి మాట్లాడుతూ, పటేల్ తన మాదకద్రవ్య వ్యసనానికి నిధులు ఇవ్వడానికి డబ్బు ఇవ్వమని మానసికంగా బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా అతని తల్లిదండ్రుల జీవితాలను దుర్భరంగా మార్చాడని వ్యాఖ్యానించారు.పటేల్ తల్లిదండ్రులు( Parents ) చాలా బాధపడ్డారు.ఈ శిక్ష ఇతరులను ఇలాంటి నేరాలకు పాల్పడకుండా నిరోధించగలదని, పటేల్‌కు పునరావాసం కల్పించి అతని వ్యసనాన్ని అధిగమించడంలో సహాయపడుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.