ఇంగ్లాండ్‌లోని హియర్‌ఫోర్డ్‌షైర్‌లో భారతీయ సంతతికి చెందిన డాక్టర్ కొలథోర్ ఈశ్వరిని మెడికల్ ట్రిబ్యునల్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది.పాకిస్థాన్‌కు చెందిన ఒక ముస్లిం సహోద్యోగిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.డాక్టర్ ఈశ్వరి తన సహోద్యోగి జాతి లేదా మతం గురించి శత్రుత్వం, ద్వేషం ప్రదర్శించారని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.
2019 నవంబర్‌లో తాను మొదటిసారిగా పాకిస్థాన్ నుంచి హియర్‌ఫోర్డ్‌లో ట్రైనింగ్ ఫెలోగా వచ్చినప్పుడు, ఆసుపత్రి వసతిలో ఉన్న డాక్టర్ ఈశ్వరికి తనను తాను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించానని ఫిర్యాదుదారు అయిన డాక్టర్ ఎ ఆరోపించారు.ఈశ్వరి తనను తాను పరిచయం చేసుకోవడానికి నిరాకరించిందని.పైగా “పోర్కీ సాసేజెస్” అని ఒకటి కంటే ఎక్కువసార్లు గొణిగిందని ఆమె ఆరోపించారు.

ఒక సందర్భంలో, తాను ఒక బాటిల్‌లోని నీటిని కెటిల్‌లోకి పోశానని.అయితే డాక్టర్ ఈశ్వరి దానిని పట్టుకుని సింక్‌లో ఆ నీటిని పారబోసి “ఈ కెటిల్‌ను మీ మురికి నీటితో మురికి చేయవద్దు” అని అన్నారని డాక్టర్ A ఫిర్యాదులో పేర్కొన్నారు.మరోవైపు డాక్టర్ కొలథోర్ ఈశ్వరి ఆరోపణలను తోసిపుచ్చారు.ఆమె వంటగదిలో బిజీగా ఉన్నానని.డాక్టర్ A వచ్చినప్పుడు హడావిడిలో ఉన్నానని చెప్పారు.ఆ సమయంలో, ఆమె సాసేజ్‌ల కోసం కమ్యూనల్ ఫ్రిజ్‌లో వెతుకుతూ.“సాసేజ్‌లు ఎక్కడ ఉన్నాయి?” అని తనలో తానే మాట్లాడుకున్నట్లు చెప్పుకొచ్చారు.

వాటర్ కెటిల్ రిమార్క్‌పై కూడా డాక్టర్ ఈశ్వతి ప్యానల్‌కి రిప్లై ఇస్తూ ఆరోగ్యం, భద్రత దృష్ట్యా కేటిల్ నుంచి నీటిని సింక్‌లో పోసినట్లు చెప్పారు.డాక్టర్ ఎ సగం నిండిన బాటిల్‌లో క్లీన్ వాటర్‌కి బదులుగా కుళాయి నీటితో నింపారని ఆమె చెప్పింది.కాగా డాక్టర్ ఈశ్వరి వాదనను ప్యానెల్ తిరస్కరించింది.
ఆమెపై వచ్చిన ఆరోపణలను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.ఈశ్వరి చర్యలు సరికాదని, తప్పుడు ప్రవర్తన కారణంగా డాక్టర్ ఈశ్వరి ప్రాక్టీస్ ఫిట్‌నెస్ బలహీనపడిందని, ఆమెను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశామని ప్యానెల్ తెలిపింది.







