సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నాకా బిలియనీర్ ఎలాన్ మస్క్ ఊహించని నిర్ణయాలతో సంచలనం రేపుతున్నారు.ట్విట్టర్‌లోని కీలక ఉద్యోగులను తొలగించిన ఆయన.
వినియోగదారులకు సైతం అంతే షాకిచ్చారు.ఇప్పటి వరకు ఉచితంగా అందించిన బ్లూటిక్‌కు రుసుము వసూలు చేస్తున్నట్లు ప్రకటించాడు.
దీంతో అన్ని వర్గాల నుంచి మస్క్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.దీంతో తాను తన నిర్ణయాలు సరైనవా.? కావా.? ట్విట్టర్ సీఈవోగా వుండాలా వద్దా.? అనే దానిపై తనకు తానే పోల్ నిర్వహించుకున్నాడు.ఇందులో 57.5 శాతం మంది యూజర్లు సీఈవోగా తప్పుకోవాలని సూచించగా… 42.5 శాతం మంది మాత్రం సీఈవోగా కొనసాగాలని కోరారు.
అయితే ఎక్కువ మంది తనను సీఈవోగా వద్దనడంతో ఎలాన్ మస్క్ స్పందించారు.త్వరలోనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.తన స్థానంలో ఓ పూలిష్ పర్సన్ రాగానే సీఈవో పోస్ట్ నుంచి తప్పుకుంటానని మస్క్ తెలిపారు.ఈ క్రమంలో తాను ట్విట్టర్ సీఈవో పోస్ట్‌కు రెడీ అని ప్రకటించారు భారత సంతతికి చెందిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్ వీఏ.
శివ అయ్యాదురై.ట్విట్టర్ సీఈవో పదవి పట్ల తనకు ఇంట్రెస్ట్‌గా వుందన్నారు.59 ఏళ్ల అయ్యాదురై ముంబైలో పుట్టారు.అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి నాలుగు డిగ్రీలు, బయోలాజికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ డిగ్రీ పొందానని ఆయన తెలిపారు.
ఏడు సాఫ్ట్‌వేర్ కంపెనీలను నిర్వహిస్తున్నానని అందుచేత తన దరఖాస్తును పరిశీలించాలని అయ్యాదురై ట్వీట్ చేశారు.ఇకపోతే.శివ అయ్యాదురై 1978లో 14 ఏళ్ల వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు.అదే మనం ప్రస్తుతం వాడుతున్న ఈమెయిల్.ఇన్‌బాక్స్, ఔట్ బాక్స్, ఫోల్డర్స్, మెమో, అటాచ్‌మెంట్స్, అడ్రెస్ బాక్స్ మొదలైనవాటిని ఇందులో పొందుపరిచారు.1982లో అమెరికా ప్రభుత్వం అతనికి ఈమెయిల్ మీద తొలి కాపీరైట్‌ను అందజేసింది.తద్వారా అధికారికంగా ఈమెయిల్ సృష్టికర్తగా అతనిని గుర్తించింది.అతని ట్రాక్ రికార్డు అయితే బాగానే వుంది కానీ.శివ అయ్యాదురై దరఖాస్తును ఎలాన్ మస్క్ ఆమోదిస్తారో లేదో చూడాలి.