బోరిస్ జాన్సన్ భారత పర్యటన : గుజరాత్‌లో ‘‘బుల్డోజర్’’ ఎక్కితే.. యూకేలో దుమారం

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇటీవల బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా గుజరాత్‌లో దిగిన ఆయనకు ఘనస్వాగతం లభించింది.

 In Uk Parliament, Opposition Criticises Pm Boris Johnson’s Visit To Gujarat Jc-TeluguStop.com

గాంధీనగర్‌లో జాతిపిత మహాత్మాగాంధీ నిర్మించిన సబర్మతి ఆశ్రమం, అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు జాన్సన్.అంతే బాగానే వుంది కానీ.

పంచమహల్‌లోని జేసీబీ ఫ్యాక్టరీని జాన్సన్ ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.భారత్‌లో ‘బుల్డోజర్’’ పేరిట రాజకీయ దుమారం రేగుతున్న వేళ.సాక్షాత్తూ బ్రిటన్ ప్రధాని బుల్డోజర్‌ను నడపడం చర్చనీయాంశమైంది.

భారత పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ఆయనకు బ్రిటన్‌లో బుల్డోజర్ సెగ తగిలింది.

బ్రిటన్ ఎంపీలు బోరిస్ జాన్సన్ వైఖరిని తప్పుబట్టారు.ఓ వర్గానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై మోడీని ప్రశ్నించడంలో ప్రధాని బోరిస్ విఫలమయ్యారని విపక్ష లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జారా సుల్తానా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీని ప్రశ్నించేందుకు బదులుగా జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారని ఆమె తప్పుబట్టారు.మానవ హక్కుల విషయంలో తమ ప్రధాని ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతోందని సుల్తానా విమర్శించారు.

జాన్సన్ భారత్ పర్యటనలో జేసీబీలతో ఫోజులిచ్చారని, ఇళ్ల కూల్చివేతలపై మోడీ వద్ద ప్రశ్నలు లేవనెత్తారో లేదో చెప్పలేదని జారా సుల్తానా దుయ్యబట్టారు.మోడీ ప్రభుత్వ చర్యలకు చట్టబద్ధత కల్పించేందుకు జాన్సన్ భారత పర్యటన ఉపయోగపడిందని అంగీకరిస్తారా.? అని ఆమె ప్రశ్నించారు.

Telugu Bjp Bulldozer, Bjp, Gujarat, Jcb Factory, Uk, Ukpm-Telugu NRI

కాగా.మనదేశంలో ఇప్పుడు బుల్డోజర్ అనే పదం బాగా వైరల్ అవుతోంది.పాత నిర్మాణాలను కూల్చేసే బుల్డోజర్ ప్రస్తుతం భారత్‌లో కొత్త రాజకీయానికి వేదికైంది.

మొదట ఉత్తరప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాలపై అక్కడి బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లను ఎక్కుపెట్టింది.అలాగే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ బుల్డోజర్ అనే పదాన్ని అస్త్రంగా వాడింది.యూపీలో మొదలైన బుల్డోజర్ సంస్కృతి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది.అయితే ఇది కాస్తా మతం రంగు పులుముకుంది.సరిగ్గా ఇదే సమయంలో బోరిస్ జాన్సన్ బుల్డోజర్‌లు ఎక్కి ఫోజులు ఇవ్వడం వివాదానికి దారి తీసింది.మరి దీనిపై యూకే ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube